ప్రపంచ వ్యాప్తంగా 5 లక్షలకు చేరువలో కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 5 లక్షలకు చేరువలో కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా  కరోనా వైరస్  జెట్ స్పీడులో  విస్తరిస్తోంది. నిన్న  ఒక్క రోజే  48 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 4 లక్షల 68 వేలు దాటింది. కరోనా వైరస్ వల్ల చనిపోయిన వారి సంఖ్య 21 వేలు దాటింది. గత 24 గంటల్లోనే కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా 2 వేల మందికి పైగా చనిపోయారు. కరోనా సోకిన వారిలో ఇప్పటివరకు లక్షా 13 వేల 8 వందల మందికి పైగా కోలుకున్నారు. వీరిలో చైనా వారే 73 వేలకు పైగా ఉన్నారు.

కాగా.. కరోనా మరణాల్లో స్పెయిన్ చైనాను క్రాస్ చేసింది. గత 24 గంటల్లోనే స్పెయిన్‌లో 656 మంది చనిపోవడంతో.. ఆ దేశంలో మొత్తం మృతుల సంఖ్య 3 వేల 6 వందలు దాటింది. చైనాలో ఇప్పటివరకు 3 వేల 281 మంది మృతి చెందారు. స్పెయిన్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య  50 వేలకు దగ్గరలో ఉంది. ఇక ఇటలీలో నిన్న మరో 683 మంది చనిపోయారు. దీంతో ఇటలీలో కరోనా మృతుల సంఖ్య 7 వేల 5 వందలు దాటింది. ఇటలీలో మొత్తం కేసుల సంఖ్య 74 వేల 3 వందలు దాటింది.

అమెరికాలో కూడా కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్న మరో 11 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యూఎస్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య  65,800 దాటింది. జర్మనీలో కరోనా కేసులు 37,300 దాటాయి.  ఇరాన్‌లో 27 వేలకు పైగా, ఫ్రాన్స్‌లో 25,200 పైగా కరోనా కేసులు నమోదయ్యయి. యూకేలో నిన్న కొత్తగా 1450 కేసులు నమోదయ్యాయి. దీంతో యూకేలో ఇప్పటివరకు 9500లకు పైగా కేసులు నమోదయ్యాయి. జపాన్‌లో కరోనా కేసుల సంఖ్య 1300 దాటగా.. పాకిస్తాన్‌లో ఇప్పటివరకు 1063 మందికి కరోనా సోకింది.

For More News..

దేశంలో 657కు పెరిగిన కరోనా కేసులు