దేశంలో కరోనా తీవ్రత రోజురోజూకూ పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో దేశంలో 88,600 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ మరియు సంక్షేమ శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 60 లక్షలకు చేరువైంది.కొత్త కేసులతో కలిపి ఇప్పటివరకు దేశంలో నమోదయిన మొత్తం కరోనా కేసుల సంఖ్య 59,92,533కి చేరింది. ఇందులో 9,56,402 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా బారినపడి కోలుకున్న వారిసంఖ్య 49,41,628గా ఉంది. శనివారం దేశవ్యాప్తంగా 1,124 మంది కరోనాతో మరణించారు. దాంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 94,503కు చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. శనివారం దేశవ్యాప్తంగా 9,87,861 మందికి కరోనా టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. దాంతో ఇప్పటివరకు దేశంలో 7,12,57,836 టెస్టులు చేసినట్లు తెలిపింది.
For More News..