యూరప్‌లో మళ్లీ మొదలైన కరోనా కేసులు

యూరప్‌లో మళ్లీ మొదలైన కరోనా కేసులు

లండన్: యూరప్ లో తగ్గిందనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. మొన్నటిదాకా తక్కువగా ఉన్న  కేసుల సంఖ్య మెల్లగా పెరుగుతోంది. దీంతో అక్కడ కరోనా సెకెండ్ వేవ్ మొదలైందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మార్చి, ఏప్రిల్ నాటి పరిస్థితులు మళ్లీ ఎదురువుతాయేమోనని యూరప్ జనాలు భయపడుతున్నారు. ఆంక్షలు సడలించడం, జనాల నిర్లక్ష్యం వల్లే కరోనా వ్యాప్తి పెరుగుతోందని ఎక్స్ పర్టులు చెబుతున్నారు.

వ్యాప్తిని తగ్గించినా..

కరోనా వ్యాప్తి మొదలైన రోజుల్లో బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్ తదితర దేశాల్లో కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. మార్చి, ఏప్రిల్ లో అక్కడ వైరస్ పీక్ స్టేజ్ కి వెళ్లింది. తర్వాత మెల్లగా కేసులు, డెత్స్ సంఖ్య తగ్గింది. మళ్లీ ఇప్పుడు వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. ఫ్రాన్స్ లో సెప్టెంబర్ నుంచి కేసుల సంఖ్య ఎక్కువవుతోంది. నాలుగైదు రోజులుగా 10 వేల మందికి పైనే వైరస్ బారిన పడుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే 13,215  కేసులు రికార్డయ్యాయి. ఏప్రిల్ తర్వాత ఇదే హయ్యెస్ట్. చెక్ రిపబ్లిక్ లో రోజూ 3 వేలకు పైనే కేసులు నమోదవుతున్నాయి. యూరప్ లో 72 రోజులుగా స్టేబుల్ గా ఉన్న డెత్ రేట్ ఇప్పుడు పెరుగుతోంది. బల్గేరియా, క్రొయేషియా, మాల్టా, రొమానియా, స్పెయిన్ తదితర దేశాల్లో మరణాల సంఖ్య ఎక్కువ అవుతోంది.

ఎందుకిలా?

యూరప్ లో ఆంక్షలు సడలించడం, ప్రజలు నిర్లక్ష్యంగా ఉండటం వల్లే కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అభిప్రాయపడింది. సెకెండ్ వేవ్ కు యువత కారణమవుతున్నారని చెప్పింది. కొత్తగా కరోనా బారిన పడుతున్న వారిలో యువకులే ఎక్కువగా ఉంటున్నారని డబ్ల్యూహెచ్‌ఓ యూరప్ డైరెక్టర్ హన్స్ క్లుగే తెలిపారు. రానున్న రోజుల్లో ట్రాన్స్ మిషన్ రేటు భారీగా పెరిగే అవకాశం ఉందని, ఈ రీజియన్ లో చాలా తీవ్రమైన పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మార్చిలో కరోనా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు నమోదైన కేసుల కంటే ఇప్పుడు ఎక్కువ నమోదవుతున్నాయని చెప్పారు.

మళ్లీ ఎక్కువైతున్నయ్‌: బోరిస్ జాన్సన్

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి సెకండ్‌ వేవ్‌ మొదలైందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు. ఫ్రాన్స్‌, స్పెయిన్‌లో తగ్గుముఖం పట్టిన కేసులు తిరిగి పెరిగిపోతున్నాయని, బ్రిటన్‌ లోనూ సెకెండ్ వేవ్ ఎదుర్కోవడం తప్పదని అన్నారు. బ్రిటన్‌లో శుక్రవారం కొత్తగా 4,322 కేసులు వెలుగులోకి వచ్చాయి. మే నెల తర్వాత ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇప్పటిదాకా బ్రిటన్ లో 3.9 లక్షల కేసులు నమోదయ్యాయి. వీరిలో 41,800 మందికి పైగా చనిపోయారు.

For More News..

రేపటి నుంచి బడులకు టీచర్లు

ఇప్పటికే 45 శాతం ఎక్కువ కురిసిన వానలు

నాలుగైదు నెలలుగా ఆరోగ్యశ్రీ బిల్లులు బంద్.. పేషెంట్లను చేర్చుకోని హాస్పిటళ్లు