పిల్లల్నీ వదలదట.. కరోనా బూచి

పిల్లల్నీ వదలదట.. కరోనా బూచి

చిల్డ్రన్స్ కేసులు పెరిగే చాన్స్
హెచ్చరిస్తున్న సైంటిస్టులు, పరిశోధనా సంస్థలు
న్యూయార్క్: కరోనా సోకిన పిల్లల సంఖ్య ప్రస్తుతం రిపోర్ట్​ చేసిన దాని కంటే ఎక్కువస్థాయిలో పెరిగే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు, రీసెర్చ్ సంస్థలు చెప్తున్నాయి. పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ డిమాండ్ పై చేసిన పరిశోధనలో తాజాగా కొన్ని విషయాలు బయటపడ్డాయి. కరోనా సోకిన 2,381 మంది చిన్నారులకు ఐసీయూల్లో ట్రీట్ మెంట్ అందిచాల్సి ఉందని పబ్లిక్ హెల్త్​ మేనేజ్ మెంట్ ప్రాక్టీస్ పేర్కొంది. కరోనా తో బాధపడుతున్న 2,100 మంది పిల్లలపై చైనీస్ సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ ప్రివెన్షన్ క్లినికల్ స్టడీ నిర్వహించింది. కరోనా కారణంగా అమెరికాలో గత నెల 18 నుంచి ఈ నెల 6 వరకు 74 మంది చిల్డ్రన్స్ పీఐసీయూల్లో అడ్మిట్ అయ్యారని నార్త్ అమెరికన్ రిజిస్ట్రీ, వర్చువల్ పీఐసీయూ సిస్టమ్స్, సైంటిస్టులు చెప్తున్నారు. ఈ టైమ్ ఫ్రేమ్ లో 1.76 లక్షల మంది పిల్లలకు ఇన్ఫెక్షన్ సోకి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పీఐసీయూ సిస్టమ్స్ ప్రకారం.. రెండేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో 30 శాతం మందికి , రెండు నుంచి పదకొండేళ్లున్న వారు 24 శాతం మందికి ,12 నుంచి 17 ఏళ్ల వయసున్న పిల్లల్లో 46 శాతం మందికి సోకింది. ఈ ఏడాది ముగిసేలోపు యూఎస్ లో 25 శాతం మంది ప్రజలకు కరోనా సోకే ప్రమాదం ఉందని తెలిపింది. అలాగే 50 వేల మంది చిల్డ్రన్స్ కూ కరోనా సోకుతుందని హెచ్చరించింది. వీరిలో 5,400 మంది పరిస్థితి సీరియస్ గా ఉంటుందని, మెకానికల్ వెంటిలేషన్ అందించాల్సి ఉంటుందని వివరించింది. కాగా, ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన పిల్లలు ఒంటరిగా ఉంటూ సెల్ఫ్ ఐసోలేషన్ ను పాటించట్లేదని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.