కరోనా భయంతో ప్రపంచం వణికిపోతుండటంతో ఇండియాలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ప్రజలను అలెర్ట్ చేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలోనే ఎవరికైనా ఫోన్ చేస్తే కరోనా వైరస్ గురించి జాగ్రత్తలు చెప్పే కాలర్ ట్యూన్ వినబడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇది ఇప్పటి వరకు ఇంగ్లీష్ లోనే వస్తుంది. అయితే ఇకపై తెలుగులోనూ ఈ ట్యూన్ వినిపించనుంది. ఈ మేరకు మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లతో ప్రభుత్వం చర్చలు జరిపింది.
ఇప్పటికే ఇందుకు సంబంధించిన వాయిస్ ను కూడా రూపొందించినట్లు తెలుస్తోంది. 50 సెకన్ల పాటు ఉండే ఈ కాలర్ ట్యూన్ అన్ని ఫోన్లలో తెలుగులోనే రానుంది. అయితే.. ఎవరికి ఫోన్ చేసినా దగ్గుతో స్టార్ట్ కావడంతో కొంతమంది విసిగిపోతున్నారు. ఇందుకోసం డయల్ ప్యాడ్ లో 1 ప్రెస్ చేస్తే ఈ ట్యూన్ కట్ అవుతుంది. అయితే ఈ ఆప్షన్ తెలుగు కరోనా కాలర్ ట్యూన్ లో ఉందో లేదో తెలియాలంటే.. ఈ ట్యాన్ వచ్చేవరకు ఆగాల్సిందే.