ఐఐటీ హైదరాబాద్లో 119 మందికి కరోనా

  • సిబ్బంది, విద్యార్థులు సహా 119 మందికి కరోనా

ఐఐటీ హైదరాబాద్లో కరోనా కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్న ఐఐటీ హైదరాబాద్ లో  విద్యార్థులు, స్టాఫ్ తో సహా 119 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనుమానంతో విద్యార్థులు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకేసారి 119 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కరోనా సోకిన వారిని ఐఐటీ క్యాంపస్ లోనే హోమ్ ఐసోలేషన్ లో ఉంచారు. వైద్యుల సూచనలు పాటిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రత్యక్ష తరగతులు ప్రారంభించిన ఐఐటీ హైదరాబాద్ కరోనా మళ్లీ విస్తరిస్తున్న  నేపథ్యంలో తిరిగి ఆన్ లైన్ తరగతులు ప్రారంభించింది. 

 

ఇవి కూడా చదవండి..

జీవో317 ఉద్యోగులకు యమపాశంగా మారింది

సిద్ధార్థ్ క్షమాపణపై స్పందించిన సైనా నెహ్వాల్

కరోనాపై ఆటో డ్రైవర్ అద్భుతమైన మెసేజ్