తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనగుతోంది. కొద్ది రోజుల నుంచి కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగా నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో తాజాగా 127 కరోనా కేసులు నమోదు కాగా.. ఆరుగురు మరణించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై గురువారం రాత్రి 8 గంటలకు బులిటెన్ విడుదల చేసింది ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో బుధవారం సాయంత్రం ఐదు గంటల నుంచి గురువారం సాయంత్రం ఐదు గంటల మధ్య నమోదైన కేసులు, మరణాల వివరాలను వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 127 కేసులు నమోదు కాగా..ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,147కు చేరింది. ఆరుగురు మరణించగా.. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 105కు పెరిగింది. అలాగే ఇవాళ 31 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1587కు చేరింది. ప్రస్తుతం 1,455 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Media bulletin
Date: June 4, 2020Status of positive cases of #COVID19 in Telangana. pic.twitter.com/cJ3CYKn3IM
— Minister for Health Telangana State (@TelanganaHealth) June 4, 2020
ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో 448 మంది విదేశాల నుంచి వచ్చిన వారు, వలస కార్మికులు ఉన్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణకు చెందిన లోకల్స్ 2699 మంది కరోనా బారినపడినట్లు వెల్లడించింది.
గడిచిన 24 గంటల్లో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 110 మంది ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 7, రంగారెడ్డి జిల్లాలో 6, మేడ్చల్ లో 2, ఖమ్మం, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్క కరోనా కేసు చొప్పున నమోదయ్యాయి.