కరోనా నాశనానికి.. 33 డిగ్రీలు.. 30 నిమిషాలు!

అమెరికన్ రీసెర్చర్ల స్టడీ

హూస్టన్: చలికాలంలో కరోనా వ్యాప్తి ఎక్కువైతదని నిపుణులు ఇప్పటికే అనేకసార్లు హెచ్చరించారు. అయితే చలి ఎక్కువైనకొద్దీ ఆయా వస్తువులపై కరోనా వైరస్ కణాలు ఎంత కాలం ఉంటాయి? అవి ఎంత టెంపరేచర్ పెరిగే వరకూ మనుషులకు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది? అన్నదానిపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్​ఉటా రీసెర్చర్లు స్టడీ చేశారు. ఇందుకోసం అచ్చం కరోనా వైరస్ కణం మాదిరిగానే ఉండే వైరస్ లైక్ పార్టికల్స్ (వీఎల్పీలు)ను వారు క్రియేట్ చేశారు. కరోనాలోని ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ తప్ప ఇతర ప్రొటీన్లు, లిపిడ్లు అన్నీ ఉండేలా తయారు చేశారు. దీంతో టెంపరేచర్ 33 డిగ్రీ సెంటీగ్రేడ్ లకు పెరిగితే.. 30 నిమిషాల్లో కరోనా కణం బయటి పొర నాశనం అవుతుందని, అది ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం తగ్గుతుందని గుర్తించారు. అలాగే లిక్విడ్ లో ఉండే వీఎల్పీల కన్నా డ్రై వస్తువులపై ఉండే వీఎల్పీలపై టెంపరేచర్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుందని తేలింది. అందుకే చలి వాతావరణంలో తేమతో కూడిన వస్తువులపై కరోనా ఎక్కువకాలం ఉండి, ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని రీసెర్చర్లు వెల్లడించారు.

For More News..

ఓఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్మకానికి పీఎం ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

జీహెచ్ఎంసీ అధికారుల ఐఫోన్ ఆశలకు బ్రేక్

మూడు రోజుల్లో బిల్స్​ ఇయ్యకుంటే సమ్మెకు సై