డా. రెడ్డీస్ నుంచి ‘అవిగాన్’డ్రగ్ డెలివరీ
ఇండియాలోకి 200 ఎంజీ ఫవిపిరవిర్ ట్యాబ్లెట్స్
42 సిటీలలో ఫ్రీ డెలివరీ
ఇంకో క్వార్టర్‌లోపు లోకల్‌గానే మాన్యుఫాక్చరింగ్
హైదరాబాద్, వెలుగు: తక్కువ తీవ్రత ఉన్న కరోనా పేషెంట్ల ట్రీట్‌మెంట్‌లో వాడేందుకు ఫవిపిరవిర్ డ్రగ్ జెనిరిక్ వెర్షన్ ను ఫార్మా కంపెనీ డా. రెడ్డీస్ బుధవారం లాంఛ్ చేసింది. దీనిని అవిగాన్ బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. కరోనా పేషెంట్ల ట్రీట్‌మెంట్‌లో అవిగాన్‌ను వాడేందుకు డీసీజీఐ నుంచి అనుమతులొచ్చాయని కంపెనీ పేర్కొంది. 200 ఎంజీ అవిగాన్ ట్యాబ్లెట్ ధర రూ. 99గా డా. రెడ్డీస్ నిర్ణయించింది. దేశంలోని 42 సిటీలలో ఈ డ్రగ్‌ను ఫ్రీ హోం డెలివరీ చేస్తామని ప్రకటించింది. 1800–267–0810కి కాల్‌చేసి లేదా www.readytofightcovid.in వెబ్‌సైట్ నుంచి ఈ మందుకు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ సర్వీస్ సోమవారం నుంచి శనివారం దాకా ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు అందుబాటులో ఉంటుంది. అవిగాన్ ఒరిజనల్ ప్రొడక్ట్ జపనీస్ కంపెనీ ఫుజిఫిల్మ్‌టొయమా కెమికల్ డెవలప్ చేసింది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ కోసం జపాన్ నుంచి ఈ డ్రగ్‌ను డా. రెడ్డీస్ దిగుమతి చేసుకుంటోంది. ఫుజిఫిల్మ్‌నుంచి టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ జరుగుతోందని, వచ్చే క్వార్టర్ నాటికి ఈ డ్రగ్ ఏపీఐ, ఫార్ములేషన్స్‌ను కంపెనీ లోకల్‌గానే తయారు చేస్తుందని డా. రెడ్డీస్ ఇండియా, ఎమెర్జింగ్ మార్కెట్ సీఈఓ ఎంవీ రమణ అన్నారు. ఈ మెడిసిన్ ధరను మరింత తగ్గిస్తాతామని, ఇతర మార్కెట్లకు ఎగుమతి కూడా చేస్తామని చెప్పారు. ఫుజిఫిల్మ్‌తో కుదిరిన గ్లోబల్ లైసెన్సింగ్ అగ్రిమెంట్ కింద అవిగాన్(ఫవిపిరవిర్) 200 ఎంజీ ట్యాబ్లెట్లను తయారు చేయడానికి, అమ్ముకోవడానికి, డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి డా. రెడ్డీస్‌కు అవకాశం ఉంటుంది. జపాన్, రష్యా, చైనా మార్కెట్లను మినహాయించి గ్లోబల్‌గా ఇతర మార్కెట్లలో ఈ డ్రగ్‌ను విక్రయించడానికి డా. రెడ్డీస్‌కు వీలుంటుంది. తొందర్లో అవిగాన్ 400 ఎంజీ ట్యాబ్లెట్లను తీసుకొస్తామని రమణ చెప్పారు.
14 రోజుల్లోనే కోలుకుంటున్న కరోనా పేషెంట్లు ..
అవిగాన్‌ను జపాన్‌లో 2,141 మంది కరోనాపేషెంట్లపై టెస్ట్ చేశారని రమణ అన్నారు . ఇందులో 74 శాతం మంది ఏడు రోజుల్లోనే రికవరీ చూపారని, 88 శాతం మంది 14 రోజుల్లో కోలుకున్నారని చెప్పారు. మొదటి రోజు 3,600 ఎంజీ( పద్దెనిమిది 200 ఎంజీ ట్యాబ్లెట్స్ ) డోస్ వాడాలని, రెండో రోజు నుంచి 14 రోజు వరకు 1,600 ఎంజీ(ఎనిమిది 200 ఎంజీ ట్యాబ్లెట్స్ ) చొప్పున డోస్‌ను వాడాలని అన్నారు . ఇండియాలోని కరోనా పేషెంట్ల కోసం ఇంత ముఖ్యమైన మెడిసిన్‌ను తీసుకురావడం ఆనందంగా ఉందని రమణ చెప్పారు. హైక్వాలిటీ,అఫర్డబులిటీ, వ్యాధి నియంత్రణ వంటి అంశాలు మెడిసిన్స్ తేవడంలో ముఖ్యమైన ప్రాధాన్యాలని పేర్కొన్నారు. కరోనాపేషెంట్ల ట్రీట్‌మెంట్‌లో అవిగాన్ సాయపడుతుందని అన్నారు . అవిగాన్ 122 ట్యాబ్లెట్లతో పూర్తి ప్యాకేజిని డా. రెడ్డీస్ అందిస్తోంది. జపాన్, యూకే, ఫ్రాన్స్, కువైట్‌లలో అవిగాన్‌పై స్టడీ చేస్తున్నామని డా. రెడ్డీస్ గ్లోబల్ ఫార్మా సర్వీసెస్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్(పీఎస్‌ఏఐ) హెడ్ దీపక్ సప్రా చెప్పారు. ఇండియాలో ఈ డ్రగ్‌పై ఫేజ్ 4 స్టడీ మొదలు పెట్టామన్నారు. వీటి లైఫ్‌టైమ్ రెండేళ్లు. ఇప్పటికే లుపిన్, గ్లెన్‌మార్క్, సన్‌ఫార్మా, హెటిరో వంటి ఫార్మా కంపెనీలు కరోనా ట్రీట్‌మెంట్ కోసం ఫవిపిరవిర్ జనరిక్ వెర్షన్స్ ను ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేశాయి.
ఇండియన్ మార్కెట్లోకి ఈ ప్రొడక్ట్ తీసుకురావడం ఆనందంగా ఉంది. మార్కెట్‌లోకి ఆలస్యంగా వచ్చినప్పటికీ అవిగాన్‌కు కొన్ని అడ్వాంటేజిలున్నాయి. ఈ ప్రొడక్ట్‌ను జపాన్‌లో 2,100 పేషెంట్లపై స్టడీ చేశారు. మంచి ఫలితాలను చూపింది. ఒక బాటిల్‌లో 122 అవిగాన్ ట్యాబ్లెట్లను ఉంచాం. ఇది పూర్తి కోర్స్‌కు సాయపడుతుంది. దేశంలోని 42 సిటీలలో ఈ డ్రగ్‌ను ఫ్రీగా హోం డెలివరీ చేస్తాం.
– జీవీ ప్రసాద్, డా. రెడ్డీస్ కో-చైర్మన్
For More News..