కరోనా వైరస్ మనుషుల ద్వారానే వ్యాపిస్తుంది కాబట్టి, ఇది మరెవరికీ సోకకుండా ముందు జాగ్రత్త పడాలి. మనమందరం ఇతరులకు కరోనా వైరస్ వ్యాపించకుండా బాధ్యత తీసుకోవాలి. మీ ద్వారా మరొకరికి ఈ వ్యాధి ఎట్టి పరిస్థితుల్లోనూ రాకుండా చూసుకోవాలి.
ఇటీవల ఈశా ఫౌండేషన్వారు కరోనా వైరస్‌పై ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా, ఈశా యోగా సెంటర్, ధ్యానలింగ, ఆదియోగి ఆవరణలను మూసివేసింది. మళ్లీ ప్రకటించేంతవరకు అవి మూసివేసి ఉంటాయని సందర్శకులు గమనించాలి. అదే విధంగా వరుసగా మార్చి నెలాఖరులో, ఏప్రిల్ మొదట్లో జరగవలసిన సద్గురు పర్యటనలన్నీ రద్దు అయ్యాయి. సద్గురు ముంబై, ఆఫ్రికాలలోని తన కార్యక్రమాలను క్యాన్సిల్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలోని అన్ని ఈశా కేంద్రాలలోనూ అన్ని కార్యక్రమాలను నిలిపివేయడం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్‌ను మహమ్మారిగా ప్రకటించింది.
ఈ వైరస్వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు ప్రభావితమయ్యాయి. బలహీన వర్గాలవారు, డైలీ వేజెస్పై జీవనం సాగించేవారి సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో రోజువారీ వేతనదారులకు సమాజం మద్దతు ఇవ్వాలి. అటువంటి వారికి ‘కనీసం రోజువారి పోషణ’ కల్పించాల్సిన బాధ్యత వివిధ వర్గాలపై ఉంది. మనం సమైక్యంగా ఉండి, వైరస్‌ను తరిమికొడదాం.
– సద్గురు జగ్గీ వాసుదేవ్, ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు