![కరోనా ఎఫెక్ట్ : ఒడిశాలో స్కూళ్లు, కాలేజీలు బంద్](https://static.v6velugu.com/uploads/2020/03/school.jpg)
ఒడిశా ప్రభుత్వం కరోనాను రాష్ట్రవిపత్తుగా ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. కరోనాను డీల్ చేసేందుకు 2వందల కోట్లు శాంక్షన్ చేశారు. ప్రజలంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు నవీన్ పట్నాయక్. అంతా కలసికట్టుగా పనిచేస్తేనే కరోనా మహమ్మారిని అరికట్టగలమన్నారు.