ఏపీలో తగ్గిన కరోనా..కొత్త కేసులు ఎన్నంటే

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పడుతున్న విషయం తెలిసిందే. అయితే గడచిన 24 గంటల్లో కొత్త కేసులు వేలలో నుంచి వందల్లోకి పడిపోవడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా 22,267 మందికి పరీక్షలు చేయగా 615 కేసులు నమోదయ్యాయి. అలాగే చిత్తూరు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం నలుగురు చనిపోయారు. 
మరో వైపు గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 2వేల 787 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3 కోట్ల 28 లక్షల 69వేల 245 కు చేరుకుందని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కొత్త కేసుల్లో అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 134 కేసులు నమోదు కాగా, అతి తక్కువగా విజయనగరం జిల్లాలో కేవలం 5 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదైన కొత్త కేసుల వివరాలు కింది పట్టికలో చూడండి..