కరోనా హెల్త్‌‌ పాలసీలొచ్చేశాయ్‌‌..

కరోనా హెల్త్‌‌ పాలసీలొచ్చేశాయ్‌‌..

బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగు: కరోనా వైరస్‌‌ వ్యాప్తితో దేశమంతటా ప్రజలు భయం భయంగా బతుకుతున్నారు. ఇప్పటికే తీసుకున్న హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌ పాలసీలు ఉన్నా, ఇన్సూరెన్స్‌‌ కంపెనీలు– హాస్పిటల్స్‌‌ మధ్య గొడవలతో తమకేమవుతుందోనని ఆందోళనతో ఉన్నారు. ఇలాంటి టైములో ఇన్సూరెన్స్‌‌ రెగ్యులేటరీ డెవలప్‌‌మెంట్‌‌ అథారిటీ ఆఫ్‌‌ ఇండియా (ఐఆర్‌‌డీఏఐ) ప్రత్యేకంగా కరోనా కోసమే రెండు హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌ పాలసీలను తెచ్చేందుకు అనుమతించింది. ఈ కొత్త పాలసీలు కరోనా రక్షక్‌‌, కరోనా కవచ్‌‌ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు రకాల పాలసీలకు వెయిటింగ్ పీరియడ్ 15 రోజులు. ఇతర ఆరోగ్య బీమా పాలసీల కంటే కరోనా రక్షక్, కరోనా కవచ్ పాలసీల ఖరీదు తక్కువ.

కరోనా కవచ్-– కరోనా రక్షక్ మధ్య తేడా ఏంటి..?

కరోనా రక్షక్ స్టాండర్డ్‌‌ బెనిఫిట్ పాలసీ అయితే, కరోనా కవచ్ స్టాండర్డ్‌‌ హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌ పాలసీ. కరోనా రక్షక్ పాలసీ కింద పాలసీదారునికి కోవిడ్‌‌ 19 పాజిటివ్ అని నిర్థారణ అయితే ఒకేసారి పెద్ద మొత్తంలో సొమ్ము లభిస్తుంది. ఎంత మొత్తానికి పాలసీ చేస్తే అంత మొత్తం ఒకేసారి వస్తుంది.
కరోనా కవచ్ పాలసీ కింద పాలసీదారునికి కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థారణ అయితే హాస్పిటల్‌‌ ఖర్చులు అంటే-, హాస్పిటల్‌‌ రూమ్‌‌ రెంట్‌‌, ఇతర ఖర్చులు, పీపీఈ కిట్ ఖర్చులు, వైద్య ఖర్చులు మొదలైనవి లభిస్తాయి. వినియోగదారుడు ఇప్పటికే ఏదైనా హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌ పాలసీ తీసుకుని ఉంటే, దానికి కోవిడ్-19 బీమా పాలసీలను యాడ్-ఆన్‌‌ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా కరోనా రక్షక్, కరోనా కవచ్ పాలసీలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ఈ కరోనా వైరస్ ప్రత్యేక బీమా పాలసీల్లో పీపీఈ కిట్ల ఖర్చు వంటి అదనపు సదుపాయాలను వినియోగదారులు పొందే వీలుంటుంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో కోవిడ్-19 బీమా తీసుకోవడం పెద్ద ధీమానే అవుతుంది. వినియోగదారుడికి ఎటువంటి హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌ పాలసీ లేకపోతే ఇప్పుడు కరోనా ప్రత్యేక పాలసీలను తీసుకోవచ్చని నవల్ గోయల్, సీఈవో, పాలసీఎక్స్‌‌ అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం