సింగపూర్ సిటీ : సింగపూర్ ను కరోనా కొత్త వేవ్ వణికిస్తోంది. మే 5 నుంచి మే 11 మధ్య వారం వ్యవధిలోనే 25,900లకు పైగా కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు వారంలో 13,700 కేసులు రికార్డయ్యాయి. వైరస్ బారిన పడి ఆస్పత్రిలో చేరుతున్న వారి సగటు సంఖ్య వారం ప్రారంభంలో 181 ఉండగా.. తర్వాతి వారంలో అది 250కి చేరుకుంది. ఈ నేపథ్యంలో హెల్త్ మినిస్ట్రీ ఓ ప్రకటన జారీ చేసింది. ఆస్పత్రుల్లో బెడ్లను అందుబాటులో ఉంచాలని తెలిపింది.
అత్యవసరం కానీ సర్జరీ కేసులను తగ్గించాలని కోరింది. కరోనా వేవ్ పై హెల్త్ మినిస్టర్ ఓంగ్ యే కుంగ్ కూడా స్పందించారు. అందరూ తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని సూచించారు. ‘‘మనం కరోనా వేవ్ ప్రారంభంలో ఉన్నాం. వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మరో రెండు నుంచి నాలుగు వారాలు అంటే.. జూన్ మధ్య నుంచి జూన్ చివరి లోపు కరోనా వేవ్ పీక్ కు చేరుకుంటుంది. ఏటా ఒకటి లేదా రెండు కొత్త వేవ్‌లు వస్తూనే ఉంటాయి” అని అన్నారు.