సిటీలో కరోనాను లైట్ తీసుకుంటున్నరు

సిటీలో కరోనాను లైట్ తీసుకుంటున్నరు

టెస్టులకు వెళ్లని ప్రైమరీ కాంటాక్స్ట్
వైరస్ కంట్రోల్ను పట్టించుకోని బల్దియా
గ్రేటర్లో కేసుల సంఖ్య తగ్గడానికి ఇవే కారణాలా?
ఇంటి ఓనర్లు, ఉద్యోగ భయంతో కొందరు టెస్టులకు దూరం

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్లో కరోనాను లైట్ తీస్కుంటున్నరు. అనేక మంది టెస్టులు చేయించుకోవడం లేదు. పాజిటివ్ వస్తే 17 రోజులు క్వారంటైన్లో ఉండాలన్న భయంతో సింప్టమ్స్ ఉన్నా ఇంట్లోనే జాగ్రత్తలు పాటిస్తున్నారు. రెంట్ కు ఉండే వాళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పాజిటివ్ వస్తే ఓనర్లు ఇల్లు ఖాళీ చేయమంటారేమోనన్న భయం వెంటాడుతోంది. కొందరు టెస్ట్ చేయించుకుంటున్నా రాంగ్ అడ్రస్ ఇస్తున్నారు. పాజిటివ్ కేసుల్లో 10శాతం అడ్రస్లు తప్పుగానే ఉంటున్నట్లు మెడికల్ సిబ్బంది చెప్తున్నారు. కాల్ చేసినా రెస్పాన్స్ లేకపోవడంతో వదిలేస్తున్నామంటున్నారు. మరోవైపు రిపోర్ట్ పాజిటివ్ వచ్చి హోం క్వారంటైన్ అవ్వాల్సి వస్తే జాబ్ కు ఇబ్బందవుతుందేమో, శాలరీ కట్ అవుతుందేమోనని ప్రైవేట్ ఎంప్లాయీస్ టెన్షన్ పడుతున్నారు. దాంతో సింప్టమ్స్ ఉన్నా ఏమీ లేనట్టుగానే మేనేజ్ చేస్తున్నారు. కరోనా పాజిటివ్ అనగానే చుట్టుపక్కల వాళ్లు దూరం పెడుతుండడంతో టెస్టింగ్ సెంటర్లకు వెళ్లలేకపోతున్నారు. ప్రైమరీ కాంటాక్స్ట్ కూడా ఇంట్లోనే ఉండి హెల్దీడైట్, విటమిన్ మెడిసిన్ పైనే ఆధారపడుతున్నారు.

ట్రేసింగ్ మర్చిన అధికారులు
వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయాల్సిన బల్దియా ట్రేసింగ్ ను మొత్తానికే వదిలేసింది. మొదట్లో పాజిటివ్ వచ్చిన వ్యక్తి ప్రైమరీ, సెకండరీ కాంటాక్స్ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కు టెస్టులు చేసేవారు. నెగెటివ్ వచ్చినా హోం క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు. ఆ ఏరియాను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించి రాకపోకలు బంద్ పెట్టారు. ఇప్పుడవేవీ కనిపించడం లేదు. ఇటీవల సిటీ హాస్పిటల్స్ ను విజిట్ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్రేసింగ్ పై నిరక్ష్ల్యంగా ఉండొద్దని ప్రభుత్వానికి సూచించినా మార్పు కనిపించడం లేదు.

అధికారుల పర్యవేక్షణ ఉండట్లే
పబ్లిక్ అలర్ట్ గా ఉండాలని చెప్తున్న అధికారులు ఆ దిశగా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. వారానికోసారైనా రివ్యూ మీటింగ్స్ పెట్టడం లేదు. జిల్లా మెడికల్ ఆఫీసర్లు పూర్తి నిరక్ష్ల్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. ఫీల్డ్ లోని సిబ్బంది పనితీరు కూడా పర్యవేక్షించడం లేదు. ఏ సెంటర్లో ఏం జరుగుతుంది, టెస్టులు చేస్తున్నారా? లేదా అని కూడా పట్టించుకోవడం లేదు. ఏదైనా సమాచారం అడిగితే మీటింగ్ ఉందంటూ దాటవేస్తున్నారు. ఈ నెల మొదట్లో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న బులిటెన్లో కేసుల సంఖ్యల వందల్లో తేడా ఉండేది. జిల్లా వైద్యాధికారులపై ఉన్నతాధికారులు సీరియస్ అవడంతో అప్పటి నుంచి జిల్లాల వారీగా కేసుల సంఖ్యే ఇవ్వడం లేదు.

పదిహేను రోజులకు ముందు ఇలా..
జీహెచ్ఎంసీ పరిధిలో వారం రోజులుగా పాజిటివ్ సంఖ్య తగ్గుతోంది. పదిహేను రోజులకు ముందు డైలీ వెయ్యికిగా కేసులొచ్చాయి. ఇప్పుడు 300 – 400 మధ్య ఉంటున్నాయి. గత నెలలో 17 రోజుల్లో 17వేల కేసులు నమోదైతే, ఈ నెల 17 రోజుల్లో చూస్తే 6,577 మాత్రమే ఉన్నాయి. గ్రేటర్లోని దాదాపు 200 సెంటర్లలో యాంటీజెన్ టెస్టులు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఒక్కో సెంటర్లో డైలీ 150 దాకా టెస్టులు చేస్తున్నారు. అయినా కేసుల సంఖ్య తక్కువగా ఉంటుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

For More News..

అందుబాటులోకి మన టిక్ టాక్ యాప్స్..

సెప్టెంబర్ 16 నుంచి జేఎన్టీయూ ఎగ్జామ్స్!

భారీ వర్షాలకు కూలిన హైటెన్షన్ టవర్లు

కన్ఫ్యూజన్ వద్దు.. గణేశ్ ఉత్సవాలు జరుపుకోండి