కరోనా వైరస్ వ్యాప్తి తెలంగాణలో విపరీతంగా పెరుగుతోంది. మొదటివారంలో రెండు కేసులుగా ఉన్న సంఖ్య.. నేడు 41కి చేరింది. తెలంగాణలో మొదటగా బయటిదేశాల నుంచి వారివల్లే కరోనా కేసులు నమోదయ్యాయి. కానీ.. తాజాగా లోకల్ కేసులు నమోదవుతున్నాయి. ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా కూడా కేసులు నమోదవుతుండటంతో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. లాక్‌డౌన్ ప్రకటించినా కూడా ప్రజలు రోడ్లమీదికి వస్తుండటంతో సీఎం కేసీఆర్ గుస్సా అయ్యారు. వెంటనే పోలీసులు, అధికారులు రంగంలోకి దిగి.. ప్రజలెవరూ రోడ్డెక్కకుండా చూడాలని ఆదేశించారు. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి.. జనాన్ని ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. కరోనా వల్ల రాష్ట్రంలో 41 పాజిటివ్ కేసులు రాగా.. ఒకరు కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
For More News..