మధ్యప్రదేశ్ లో 580 మంది పోలీసులకు కరోనా పాజిటివ్

మధ్యప్రదేశ్ లో 580 మంది పోలీసులకు కరోనా పాజిటివ్

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ముఖ్యంగా ప్రజలను అలర్ట్ చేస్తూ విధులు నిర్వహిస్తున్న పోలీసులు కరోనా భారిన పడుతున్నారు. ఇప్పటి వరకు మధ్యప్రదేశ్ లో 580 పోలీసులకు కరోనా సోకిందని, 2000 మంది పోలీసులను క్వారంటైన్‌ చేశామని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు. రాష్ట్రంలో 2వేల మంది పోలీసులకు సెలవు మంజూరు చేశామని… వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకుతుందనే భయంతో వారిని క్వారంటైన్‌ కు తరలించామని చెప్పారు. పోలీసుల ఆరోగ్యం కాపాడటానికి తాము తగిన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కరోనా కారణంగా అత్యవసర పరిస్థితులున్నా వారి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సెలవులు మంజూరు చేశామని మంత్రి నరోత్తం మిశ్రా వివరించారు.