హైదరాబాద్ లో చాట్ కి ఫేమస్ అయిన గోకుల్ చాట్ యజమానికి కరోనా పాజిటివ్ వచ్చింది. కోఠి నుంచి వెళ్లే వారు ఒక్కసారైనా గోకుల్ చాట్ లో చాట్ తినాలని అనుకుంటారు. షాపు ఓపెన్ అయినప్పటినుంచి రాత్రి వరకు జనాలతో కిక్కిరిసిపోతుంది. అటువంటి ఈ షాపు ఈ నెల 8 వ తేదీ నుంచి నేటి వరకు ఓపెన్ అయింది. యజమాని విజయ్ వర్గీకి కరోనా సోకడంతో వెంటనే అధికారులు గోకుల్ చాట్ ను మూసివేయించారు. గత రెండు రోజుల నుంచి షాపుకు వచ్చిన వారి వివరాలు అధికారులు సేకరిస్తున్నారు. అంతేకాకుండా షాపులో పనిచేసే వారందరిని క్వారంటైన్ కు తరలించారు. విజయ్ వర్గీని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం వందల మంది గోకుల్ చాట్ కు వచ్చినట్లు గుర్తించారు.
For More News..