ఐసోలేషన్‌కు పంపొద్దంటూ తల పగులగొట్టుకున్న కరోనా పాజిటివ్ వ్యక్తి

ఆదిలాబాద్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ముంబాయి నుంచి వచ్చిన వలసకార్మికులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఉట్నూర్ మండలం, శాంతి నగర్‌కి చెందిన ఐదుగురికి కరోనా సోకినట్లు జిల్లా అదనపు వైద్యాధికారి నిర్దారించారు. వీరంతా ఇటీవలే ముంబాయి నుండి వచ్చారు. వీరందరినీ ఇప్పటికే 14 రోజుల ఉట్నూర్ క్వారంటైన్‌ సెంటర్‌లో ఉంచారు. క్వారంటైన్ పూర్తయిన తర్వాత వీరిని ఇంటికి పంపించారు. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు రావడంతో పరీక్షలు చేయగా.. వారందరికీ కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. అయితే వీరిలో ఒక వ్యక్తి.. తమను ఐసోలేషన్ వార్డుకు తరలించవద్దని తల పగులగొట్టుకున్నాడు. వైద్యులు చికిత్స చేసిన అనంతరం.. వారందరినీ ఐసోలేషన్ వార్డుకు తరలించారు.

For More News..

కరోనా పేరిట సదురుకుంటన్రు

నన్నెందుకు నామినేట్‌ చేయలేదు?

సింగరేణి బాధితులకు రూ. 40 లక్షలు.. ఒక జాబ్