రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు అధికం

రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు అధికం

హైదరాబాద్ : కరోనా విషయంలో ముందునుంచీ ప్లానింగ్ గా పనిచేస్తున్నామన్నారు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్.  రాష్ట్రంలో యాక్టీవ్ కేసులు 15.42శాతం మాత్రమే ఉన్నాయని తెలిపారు. వైరస్ నిర్థారణ పరీక్షల్లో పాజిటివ్ రేటు గణనీయంగా తగ్గిందని.. దేశంలోని మిగితా రాష్ట్రాలతో పోలిస్తే.. మన దగ్గర రికార్డు స్థాయిలో 84శాతం రికవరీ రేటు ఉందన్నారు. నల్గొండ, వరంగల్ జిల్లాల్లో కేసులు కొంచెం ఎక్కువగా ఉన్నాయని అయితే నియంత్రణ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

ప్రతి 10 లక్షల మందిలో 79 వేల మందికి టెస్టులు చేస్తున్నామన్నారు. ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్తలు కంటిన్యూ చేయాలని, జూన్‌ లో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదని తెలిపారు. ఆక్సిజన్ బెడ్ల కొరత లేకుండా చూస్తున్నామని, జిల్లా, తాలుకా స్థాయి ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్ బెడ్లు సిద్ధం చేశామని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత లేదని తెలిపారు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్.