ఈ దేశాల్లో కరోనా రూల్స్ ఎత్తేసిన్రు

ఈ దేశాల్లో కరోనా రూల్స్ ఎత్తేసిన్రు

న్యూఢిల్లీ: ప్రపంచానికి మహమ్మారిలా తయారైన కరోనా మొదలై ఇప్పటికే ఏడాదిన్నర దాటిపోయింది. ఎన్నో దేశాలు వైరస్ ధాటికి అల్లాడిపోయాయి. చాలా దేశాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. ఫాస్ట్ గా టీకాలు వేసిన కొన్ని దేశాలు ఇప్పటికే కరోనా రూల్స్ ను ఎత్తేశాయి. మాస్కులు పెట్టుకోనవసరం లేదని ప్రకటించాయి. కొన్ని దేశాల్లో మాత్రం పరిస్థితి మెరుగైనట్లే కన్పించి.. మళ్లీ డెల్టా వేరియంట్ కారణంగా రిస్క్ పెరిగింది. దీంతో ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా వంటి దేశాలు మళ్లీ ఆంక్షలు, లాక్ డౌన్​ల దిశగా అడుగులు వేస్తున్నాయి.

రద్దీగా ఉన్నచోటే..
బ్రిటన్​లోని ఇంగ్లాండ్ లో ఇప్పుడు ఫేస్ మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరంలేదు. ఇతర కరోనా రూల్స్ అన్నీ ఎత్తేశారు. కరోనా నుంచి ఫ్రీడమ్ వచ్చేసిందని ప్రభుత్వం ప్రకటించింది. కానీ జనం రద్దీగా ఉండేచోట్ల మాత్రం మాస్కులు పెట్టుకోవాలంది. స్కాట్లాండ్​లో షాపులకు వెళ్లినప్పుడు, బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు, రెస్టారెంట్లు, పబ్ లలో తినేందుకు కూర్చున్న టైంలో తప్ప నిలబడినప్పుడు మాస్కులు పెట్టుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. వేల్స్​లో పబ్లిక్ ఇండోర్ ఏరియాల్లో మాస్కులు పెట్టుకోవాలని అక్కడి సర్కార్ చెప్తోంది. ఇక నార్తర్న్ ఐల్యాండ్​లో ప్రార్థనా మందిరాల్లో, క్లాస్ రూంలలో సోమవారం నుంచి మాస్కులు తప్పనిసరికాదు. 

ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా యూటర్న్ 
మాస్క్ అవసరంలేదని ప్రకటించిన కొన్ని వారాలకే మళ్లీ కేసులు పెరగడంతో ఇజ్రాయెల్ యూటర్న్ తీసుకుంది. పోయిన నెలలోనే మాస్కులను తప్పనిసరి చేసింది. ఇజ్రాయెల్ కరోనాను బాగా కట్టడి చేయడంతో పాటు ఫాస్ట్​గా దేశంలోని పెద్దవాళ్లందరికీ వ్యాక్సిన్లు వేసింది. అయితే డెల్టా వేరియంట్ కారణంగా దేశంలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. దీంతో గురువారం నుంచి మళ్లీ ఆంక్షలను విధించారు. అలాగే ఆస్ట్రేలియాలోనూ కేసులు పెరుగుతుండటంతో మళ్లీ లాక్​డౌన్​లు పెట్టారు. మాస్క్, ఇతర రూల్స్​ను స్ట్రిక్ట్ చేశారు. 

స్వీడన్: కరోనా మొదలైనప్పటి నుంచీ స్వీడన్ ఫుల్ లాక్ డౌన్ పెట్టలేదు. బస్సుల్లో జనం రద్దీగా ఉంటేనే మాస్కులు పెట్టుకోవాలంది. ప్రజలు తమంతట తామే రూల్స్ పాటించాలని సూచించింది. రెస్టారెంట్లు, ఇతర ప్రాంతాల్లో రద్దీని తగ్గించేందు కు మాత్రం చర్యలు చేపట్టింది. దేశానికి వస్తున్న వాళ్లకు కరోనా టెస్ట్​ తప్పనిసరి చేశారు.అమెరికా : చాలా రాష్ట్రాల్లో మాస్క్ కంప ల్సరీ కాదు. 2 డోసుల టీకా తీసుకున్నోళ్లకు మాస్క్ అక్కర్లేదని రాష్ట్రాలు ప్రకటించాయి. పబ్లిక్ ప్లేస్​లలో మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరంలేదని 31 రాష్ట్రాలు ప్రకటించాయి. 
చైనా: కరోనా పుట్టిన చైనా ఇప్పుడు మాస్క్ ఫ్రీ దేశం. ఇక్కడ కూడా మాస్కులు కంపల్సరీ కాదు. మొదట్లో కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా పడినా, స్ట్రిక్ట్ లాక్ డౌన్​లతో వైరస్​ను కమ్యూనిస్ట్ సర్కార్ కట్టడి చేసింది. ఇప్పటికే దేశంలో 152 కోట్ల డోసుల టీకాలు వేశారు.  
న్యూజిలాండ్:  కరోనాను అన్ని దేశాల కంటే స్పీడ్ గా, బాగా కట్టడి చేసిన న్యూజిలాండ్ ప్రధాని జెసిండ్రా ఆర్డర్న్ కు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇక్కడ మాస్క్, ఇతర రూల్స్ ను కూడా త్వరగానే ఎత్తేశారు.  
హంగరీ: హాస్పిటల్స్​లో తప్ప మిగతా ప్రాంతాల్లో ఫేస్ మాస్కులు అక్కర్లేదని ప్రభుత్వం ప్రకటించింది. మే నెలలో దేశంలో 50 లక్షల మందికి టీకాలను పూర్తి చేయడంతో మాస్క్, ఇతర రూల్స్ ను ఎత్తేశారు. 
ఇటలీ: కిందటేడాది ఫిబ్రవరిలో తొలి కేసు గుర్తించిన నాటి నుంచి ఇటలీ ప్రభుత్వం కరోనా కట్టడి చర్యలు చేపట్టింది. జూన్​లో వైరస్​ కేసులు కంట్రోల్​లోకి రావడంతో ప్రభుత్వం మాస్క్ రూల్​ను ఎత్తేసింది.