
ఏపీలో రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎక్కువ సంఖ్యలో కరోనా టెస్టులు చెస్తున్న ఏపీ ప్రభుత్వం .. మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఇంట్లో ఒక వ్యక్తికి కరోనా శాంపిల్ టెస్ట్ జరపాలని నిర్ణయించింది. దీనికి ప్రధాన కారణం ఒకటే. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ టెస్టులు జరిపించే దేశాలు సక్సెస్ అవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని… సీఎం జగన్ కూడా ప్రతి ఇంట్లో ఒకరికి టెస్ట్ జరపాలని అధికారులను ఆదేశించారు.
ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలో శనివారం రాత్రి ప్రతి ఇంట్లో ఒకరికి చొప్పున కరోనా పరీక్షలు చేశారు. స్థానిక గ్రామ వాలంటీర్లు తమ పరిధిలోని 50 కుటుంబాల్లో ఒక్కొక్కరిని తీసుకెళ్లి పరీక్షలు జరిపించారు. ఈ ఫలితాలు రెండు రోజుల్లో వస్తాయి. తాజా నిర్ణయం ప్రకారం ప్రభుత్వం ముందుగా రెడ్ జోన్ జిల్లాలైన కర్నూలు, గుంటూరు, కృష్ణ, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరులో ఇంటికొకరికి కరోనా టెస్టులు జరిపించబోతోంది. ఒకవేళ ఇలాంటి టెస్టుల్లో ఎవరికైనా పాటిజివ్ వస్తే… వెంటనే ఆ వ్యక్తి ఉంటున్న ఇల్లు, చుట్టుపక్కల ఇళ్లలో అందరికీ టెస్టులు జరిపించనున్నట్లు తెలుస్తోంది.