కరోనా సెక్యూర్డ్ ట్రావెలర్ టెయిలర్

అమెరికాకు చెందిన బౌల్అజ్ అనే కంపెనీ తయారు చేసిన ట్రావెలర్ టెయిలర్ ఇది. దీనికి ఆ కంపెనీ టెర్రా ఫిర్మా అని పేరు పెట్టింది. దూర ప్రాంతాలకు కార్లలో టూర్ వెళ్లే వాళ్లు అక్కడ కరోనా వైరస్ బారిన నుంచి సేఫ్టీ కోసం దీనిని తయారు చేసినట్లు కంపెనీ చెబుతోంది. ఎనిమిదిన్నర అడుగుల పొడవు, 25 అడుగుల ఎత్తు ఉన్న ట్రావెలర్‌‌ను కార్లు, జీపులు వంటి వాటికి తగిలించుకుని తీసుకుని వెళ్లొచ్చు. దీనిలోపల ఒక కిచెన్, బెడ్రూమ్, అటాచ్డ్‌‌ బాత్రూమ్‌‌, ఒక స్పెషల్ పెట్‌‌ రూమ్‌‌ ఉన్నాయి. లోపలి స్పేస్ మొత్తాన్ని యూవీసీ లైట్ ద్వారా డిసిన్ఫెక్ట్ చేసే సిస్టమ్‌‌ను దీనికి సెట్ చేశారు. హాస్పిటల్స్‌‌లో ఉండే హెపా ఫిల్టర్స్ కూడా ఫిట్ చేశారు. లోపల ఫ్రెష్ వాటర్ సిస్టమ్, రూమ్స్‌‌లో వేడిగా ఉండాలంటే హీటింగ్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. ఇన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సిస్టమ్స్‌‌ ఉన్న ఈ ట్రావెలర్ టెయిలర్ కొనాలంటే అపర కుబేరులకు తప్ప మామూలు వ్యక్తుల వల్ల కానిపనే. దాని రేటు దాదాపు కోటి 91 లక్షల రూపాయలు అని కంపెనీ వెల్లడించింది. ఇప్పుడు ఆర్డర్లు పెడితే ఈ ఏడాది చివరికో, వచ్చే ఏడాది మొదట్లోనో డెలివరీ చేస్తారట. లైట్ వెయిట్ ఉండడం కోసం రాకెట్ల తయారీలో వాడే అల్యూమినియంతో దీనిని తయారు చేయడం వల్లనే ఇంత కాస్ట్ అవుతోందని కంపెనీ చెబుతోంది.  ఎలక్ట్రికల్ వెహికల్స్‌‌ను అత్యవసరంగా చార్జింగ్ చేయాల్సివస్తే దీనిలో ఉండే 8 కిలోవాట్ అవర్ లిథియం- ఐరన్ -ఫాస్ఫేట్‌ బ్యాటరీ సిస్టమ్ నుంచి చార్జ్ చేసుకోవచ్చు. దీని ద్వారా 50 కిలోమీటర్ల వరకు నడిపించొచ్చు. మళ్లీ వేరే పవర్ సోర్స్ లేకుండానే ఈ టెయిలర్ బ్యాటరీని మూడు నాలుగు గంటల్లోనే ఫుల్ రీచార్జ్ చేసుకునేలా టాప్ డోమ్ కోటింగ్ చేసినట్లు కంపెనీ వెల్లడించింది.