వైరస్ సోకిన వారి ఇండ్లకు ‘కరోనా’ స్టిక్కర్లు

వైరస్ సోకిన వారి ఇండ్లకు ‘కరోనా’ స్టిక్కర్లు

హైదరాబాద్, వెలుగు: కరోనా వైరస్ పాజిటివ్ పేషెంట్లు, వారితో క్లోజ్ కాంటాక్ట్ అయిన వాళ్ల ఇండ్లకు ‘అలర్ట్’ స్టిక్కర్లు అతికించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా విదేశాల నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చిన వారి ఇంటి బయట ఈ స్టిక్కర్లు అతికించనున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు స్టిక్కర్లను విడుదల చేశారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చి కరోనా పాజిటివ్‌‌‌‌గా తేలిన వ్యక్తులను
ఐసోలేషన్‌‌లో ఉంచాలని ప్రభుత్వం ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. వారి ఇళ్ల ముందు స్టిక్కర్లు వేయనున్నారు. దానిపై ‘ఈ ఇల్లు ఆరోగ్య శాఖ నిర్బంధంలో ఉన్నది. ఎవరూ రాకూడదు, సందర్శకులకు అనుమతి లేదు’ అని పేర్కొన్నారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఐసోలేషన్​ ఉన్నదీ, వారి పేరు, అడ్రస్‌‌‌‌, కుటుంబంలో మొత్తం సభ్యుల సంఖ్యను దానిపై రాయనున్నారు.

For More News..

అవసరమైతే తెలంగాణ షట్ డౌన్

24 గంటలు చీమ చిటుక్కుమనొద్దు