- వందశాతం వ్యాక్సిన్ టార్గెట్‌గా 175 మొబైల్ వెహికల్స్ ఏర్పాటు
- హెల్త్, జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్అధికారులతో సీఎస్ సమావేశం
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ ప్రాంతాల్లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహణపై వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, బల్దియా కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్, కంటోన్మెంట్ బోర్డు అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ శనివారం బీఆర్కే భవన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. సోమవారం నుంచి15 రోజుల పాటు గ్రేటర్‌లోని 4,846 కాలనీలు, మురికివాడలతో పాటు అన్ని ప్రాంతాలు, కంటోన్మెంట్ జోన్‌లోని 360 ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుందన్నారు. వందశాతం వ్యాక్సిన్ టార్గెట్ గా ఈ డ్రైవ్ చేపట్టామన్నారు. బల్దియా పరిధిలో 150, కంటోన్మెంట్ ప్రాంతంలో 25 మొబైల్ వెహికల్స్ తిరుగుతాయన్నారు. ప్రతి వెహికల్లో వ్యాక్సిన్ వేసేందుకు ఇద్దరు సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారన్నారు. ప్రతి కాలనీలో ఇద్దరు వ్యక్తులతో కూడిన మొబిలైజేషన్ టీమ్‌లు వ్యాక్సిన్ తీసుకోని వారిని ముందుగానే గుర్తించి వారికి టీకా అందేలా చూస్తాయన్నారు. ఇంటింటికీ వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత ప్రతి ఇంటి డోర్ మీద స్టిక్కర్ అతికిస్తారన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ ను గ్రేటర్ జనం సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో కంటోన్మెంట్ బోర్డు సీఈవో అజిత్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రావు, సీఎం ఓఎస్డీ డాక్టర్ గంగాధర్, అధికారులు పాల్గొన్నారు.
రెసిడెన్షియల్ సెగ్మెంట్లకు సమానంగా..
రెసిడెన్షియల్ సెగ్మెంట్లకు సమానంగా మాల్స్, మల్టీప్లెక్సులకు విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో... బిల్డర్లు కూడా మాల్స్ పై ఫోకస్ పెడుతున్నారు. సుచిత్ర సర్కిల్లో రెండు బడా నిర్మాణ సంస్థలు... మూడేళ్ల క్రితం రెసిడె న్షియల్ ప్రాజెక్టులను చేపట్టింది. తాజాగా కమర్షియల్ స్పేస్‌కు ఎకరన్నర పైగా జాగాలో రెండు 8 స్టోర్డ్ బిల్డింగుల నిర్మాణం చేపట్టారు. కరోనా కారణంగా నిర్మాణ పనులు ఆగిపోయాయని, లేకపోతే ఈ ఏడాది మార్చిలోనే రెసిడెన్షియల్స్ అందుబాటులోకి వచ్చేవని బిల్డర్ వెంకట్రావ్ వివరించారు. మరో నిర్మాణ సంస్థ కూడా రెంటల్ ఇన్ కం వచ్చేలా ఓఆర్ఆర్ పరిసరాల్లోని గుండ్లపోచంపల్లి, కొంపల్లి, తూంకుంట, దుండిగల్ కేంద్రంగా చేసుకుని 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే 9 ఫ్లోర్ల మల్టీప్లెక్స్ ప్రాజెక్టును చేపట్టింది.