కరోనా టీకా: ఎలుకలపై సక్సెస్.. ఇక మనుషులపై..

కరోనా టీకా: ఎలుకలపై సక్సెస్.. ఇక మనుషులపై..

ఎలుకలపై టీకా సక్సెస్
బ్యాండ్ ఎయిడ్ లా అతికిస్తేచాలు..
కరోనాయాంటీబాడీలను రిలీజ్ చేస్తది
మనుషుల్లో పరీక్షలకు ఏడాది పట్టొచ్చు
యూనివర్సిటీ ఆఫ్ పిట్స్ బర్గ్ రీసెర్చ్

వాషింగ్టన్: చేతికి దెబ్బ తగిలితే వాడే బ్యాండ్ ఎయిడ్ లాంటిది చర్మంపై అతికించుకుంటే చాలు.. మన బాడీలోని కరోనా మహమ్మారి ఖతం అయిపోతది. అవును.. కరోనా వైరస్ ను రోగనిరోధక వ్యవస్థ అంతం చేసేందుకు కావలసిన యాంటీబాడీలను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పిట్స్ బర్గ్ సైంటిస్టులు తయారు చేశారు. వాటిని శరీరంలోకి రిలీజ్ చేసేందుకు చిన్న బ్యాండ్ ఎయిడ్ లాంటి పట్టీని కూడా రూపొందించారు. అయితే ఇప్పటివరకూ ఈ టీకాను ఎలుకల పైనే టెస్ట్ చేశారు. ఎలుకల్లో కరోనాను నిర్మూలించడంలో ఇది సక్సెస్ అయిందని ప్రకటించారు. మనుషుల్లో దీన్ని పరీక్షించి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలంటే ఏడాది పట్టొచ్చని చెప్తున్నారు.

టీకా ఎట్ల పనిచేస్తది?
కరోనా వైరస్ పై ఉండే స్పైక్ ప్రొటీన్లను నాశనం చేయడం టార్గెట్ గా తయారు చేసిన ఈ టీకాకు ‘పిట్స్ బర్గ్ కరోనా వైరస్ వ్యాక్సిన్ (పిట్ కొవ్యాక్)’ అని పేరు పెట్టారు. దీన్ని ఎలుకల చర్మంపై అతికించగా, రెండువారాల్లోనే కొత్త కరోనా వైరస్ కు వ్యతిరేకంగా యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయి. ఇంతకుముందు తయారు చేసిన సార్స్, మెర్స్టీకాల మాదిరిగానే ఇది కూడా సక్సెస్ ఫుల్ గా యాంటీబాడీలను ఉత్పత్తి చేయగలిగిందని, ఇవి శరీరంలో ఏడాది పాటు యాక్టివ్ గా ఉంటాయని అంచనా వేశారు. ల్యాబ్ లో తయారు చేసిన కరోనా వైరస్ స్పైక్ ప్రొటీన్ ముక్కలను వీరు ఇందులో ఉపయోగించారు. రోగనిరోధక వ్యవస్థ స్పందించి, వీటిని నాశనం చేయగలిగింది. దీంతో నిజమైన వైరస్ ప్రవేశిస్తే.. దాని స్పైక్ ప్రొటీన్ ల మాదిరిగానే ఈ యాంటీబాడీలు ఉంటాయి కాబట్టి.. రోగనిరోధక వ్యవస్థ వైరస్ ను చంపుతుంది.

For More News..

ఫ్రీ బియ్యం స్లో పంపిణీ

బండి ఆపినందుకు పోలీసు గల్లా పట్టుకున్న హైదరాబాద్ మహిళ