నిమ్స్ డైరెక్టర్ మనోహర్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ కు సంబంధించిన పనులను ఈ నెల ఏడో తేదీ నుంచి మొదలుపెడ్తామని నిమ్స్ డైరెక్టర్, డాక్టర్ మనోహర్ తెలిపారు. వ్యాక్సిన్ ట్రయల్‌లో పాల్గొంటామని చాలా మంది తమను సంప్రదిస్తున్నారని చెప్పారు. వారిలో హెల్తీగా ఉన్నవాళ్లను ఎంచుకుని.. వాళ్ల స్వాబ్, రక్తనమూనాలను ఢిల్లీలోని ఐసీఎంఆర్ ల్యాబ్ కు పంపిస్తామని వివరించారు. అక్కడి డాక్టర్లు సూచించిన వారిపై ట్రయల్స్ చేస్తామన్నారు. మొత్తం 30 నుంచి 60 మందిపై ట్రయల్ చేయనున్నట్టు మనోహర్ వెల్లడించారు. ఒక్కొక్కరికి 14 రోజుల వ్యవధిలో రెండు డోసుల వ్యాక్సిన్ ఇస్తామన్నారు. వ్యాక్సిన్ ఇచ్చాక తొలి రెండ్రోజులు అబ్జర్వ్ చేస్తామని, తర్వాత ఇంటికి పంపిస్తామని చెప్పారు. 14
రోజుల తర్వాత మరో డోస్ ఇస్తామన్నారు.
For More News..