కరోనా వైరస్ అన్ని దేశాలకు విస్తరిస్తోంది. రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా.. ఆస్కార్ విజేత, హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్ మరియు అతని భార్య, నటి రీటా విల్సన్ ఇద్దరికీ కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం వారిద్దరూ ఆస్ట్రేలియాలోని ఒక ఆస్పత్రిలో ఉన్నారు. ఒక చిత్ర నిర్మాణం కోసం ఈ దంపతులిద్దరూ ఆస్ట్రేలియా వెళ్లారు. తామిద్దరికీ కరోనా వైరస్ పాజిటివ్‌గా వచ్చినట్లు టామ్ హాంక్స్ తన ట్విట్టర్లో తెలిపారు.
‘నేను మరియు రీటా ఒక సినిమా కోసం ఇక్కడికి వచ్చాం. మాకు కొంచెం జ్వరంతో పాటు, బాడీ పెయిన్స్ కూడా వచ్చాయి. దాంతో హాస్పిటల్‌కి వెళ్లాం. అక్కడ డాక్టర్లు పరీక్షలు చేసి కరోనా పాజిటివ్‌గా తేల్చారు. వైరస్ కంట్రోల్‌లోకి వచ్చేంతవరకు ఇక్కడే ఉండాలని డాక్టర్లు మాకు సూచించారు’ అని టామ్ తన ట్విట్టర్లో పోస్టు చేశారు.
ఎల్విస్ ప్రెస్లీ జీవితచరిత్రపై తెరకెక్కుతున్న ఒక సినిమాలో హాంక్స్ రాకర్స్ మేనేజర్ కల్నల్ టామ్ పార్కర్ పాత్రను పోషిస్తున్నాడు. ఆ సినిమా చిత్రీకరణకోసం టామ్ దంపతులు ఆస్ట్రేలియాకు వెళ్లారు. 1990 కాలంలో ఫిలడెల్ఫియా మరియు ఫారెస్ట్ గంప్‌లలో చేసిన ప్రదర్శనలకుగాను హాంక్స్ అకాడమీ అవార్డులను గెలుచుకున్నారు. టామ్ పలు సినిమాలలో నటిస్తూ.. దర్శకుడిగా కూడా పనిచేశారు.
ఇప్పటివరకు కరోనా వైరస్ వల్ల 118 దేశాలలో 121,000 మందికి పైగా అనారోగ్యం బారిన పడ్డారు. దాదాపు 4,300 మందికి పైగా ఈ వైరస్ వల్ల చనిపోయారు.
For More News..