దేశంలో ఇటీవల రోజూ వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదవుతుండగా.. గురువారం ఆ సంఖ్య కొంచెం తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 826 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఇవాళ సాయంత్రం ఐదు గంటల బులెటెన్ లో వెల్లడించింది కేంద్ర ఆరోగ్య శాఖ. అలాగే నిన్న సాయంత్రం ఐదు గంటల నుంచి ఇప్పటి వరకు 28 మంది మరణించినట్లు తెలిపింది. దేశంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,759కి చేరినట్లు చెప్పింది. అందులో 420 మంది మరణించగా.. 1515 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించింది. ఇక 10,824 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
3 వేలకు సమీపంలో మహారాష్ట్ర
రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా 2,919 కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 1578, తమిళనాడులో 1248, మధ్యప్రదేశ్ లో 1120, రాజస్థాన్ లో 1023 మందికి కరోనా సోకింది. గుజరాత్ లో 871, యూపీలో 773, తెలంగాణలో 698, ఏపీలో 534, కేరళలో 388, కర్ణాటకలో 315 కరోనా కేసులు నమోదయ్యాయి.