మార్చి 31 వరకు రాష్ట్రమంతా లాక్ డౌన్

మార్చి 31 వరకు రాష్ట్రమంతా లాక్ డౌన్

కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం రాష్ట్రమంతా మార్చి 31 వరకు లాక్ డౌన్ చేయాలని ఆదేశించారు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్. అత్యవసర సేవలు మినహా అన్నీ మూసేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ సర్వీసులు, పాలు, కూరగాయలు వంటి ఆహార పదార్థాలు సేల్స్, మెడికల్ సర్వీసులు కొనసాగుతాయని చెప్పారు. ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదివారం ఉదయం ఆయన ఆదేశించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సీఎం అమరీందర్ సింగ్ తన ట్విట్టర్ అకౌంట్‌లో ఏయే సేవలు అందుబాటులో ఉంటాయి? ఏవి మూసేయాలన్నది పోస్ట్ చేశారు.


దేశ వ్యాప్తంగా ఆదివారం వరకు 341 మందికి కరోనా సోకినట్లు తెలిపారు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. పంజాబ్‌లో 13 మందికి వైరస్ సోకగా.. ఒకరు మరణించారు. కాగా, దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావిత 75 జిల్లాలను మార్చి 31 వరకు లాక్ డౌన్ చేయాలని ఆదివారం మధ్యాహ్నం కేంద్రం ఆదేశించింది.