థర్డ్ వేవ్ ముగిసింది... కరోనా ఆంక్షలు లేవు

థర్డ్ వేవ్ ముగిసింది... కరోనా ఆంక్షలు లేవు

రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డీహెచ్ శ్రీనివాసరావు. జనవరి 28న కరోనా థర్డ్ వేవ్ పీక్ స్టేజ్‌కు వచ్చింది.  రాష్ట్రంలో పాజిటివిటీ రేట్ 2కంటే తక్కువగా ఉందన్నారు. 4%  ఆస్పత్రి బెడ్స్  నిండాయన్నారు. మూడోవేవ్ పూర్తిగా ముగిసిందన్నారు.  మొదటి వేవ్ వల్ల దాదాపు 10 నెలలు ఇబ్బంది పడ్డామన్నారు డీహెచ్. కరోనా థర్డ్ వేవ్ దాదాపు ఆరు నెలలు ఉందన్నారు. మూడో వేవ్  28 రోజుల్లోనే  అత్యధిక కరోనా కేసులు నమోదు అయ్యాయన్నారు. తెలంగాణ కోవిడ్ ని సమర్ధంగా ఎదుర్కొంటోందన్నారు. తెలంగాణలో నిర్వహించిన ఫీవర్ సర్వే సత్ఫలితాలు వచ్చాయన్నారు.  కోవిడ్ నియంత్రణలో వ్యాక్సిన్ కీలక ఆయుధంగా పని చేసిందని తెలిపారు. 

కరోనా థర్డ్ వేవ్ కేవలం రెండు నెలల్లోనే అదుపులోకి వచ్చిందన్నారు. మూడో వేవ్ లో  టీకా తీసుకొని వారు 2.8% మంది ఆస్పత్రి పాలయ్యారన్నారు.  31లక్షల  నిర్ధారణ పరీక్షలు చేసామమన్నారు. మూడో వేవ్‌లో జనవరి 25న అత్యధికంగా 4800 కేసులు నమోదు అయ్యాయన్నారు.  మూడో వేవ్ లో కేవలం 3000 మంది రోగులు మాత్రమే ఆసుపత్రుల్లో చేరారన్నారు. మూడో వేవ్ ఫీవర్ సర్వే లో 4 లక్షల మందికి కరోనా కిట్‌లు అందించామన్నారు.  కోవిడ్ కి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేవన్నారు.  అన్ని సంస్థలు 100% పని చేయొచ్చని తెలిపారు. ఉద్యోగులు పూర్తి సంఖ్యలో కార్యాలయాలకి రావచ్చని డీహెచ్ తెలిపారు. ఐటి ఇండస్ట్రీ సైతం వర్క్ ఫ్రొం హోమ్ తీసివేయవచ్చన్నారు. వర్క్ ఫ్రొం హోమ్ ని విరమించాలని కోరుతున్నామమన్నారు డీహెచ్ శ్రీనివాసరావు. 

విద్య సంస్థలు పూర్తిగా ప్రారంభించామమన్నారు.  పిల్లలలో ఆన్‌లైన్ తరగతులతో మనసిక సమస్యలు తలెత్తాయన్నారు.  కేసులు తగ్గినా మాస్క్ లు ధరించాలన్నారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.  మేడారం జాతరకు ప్రత్యక ఏర్పాట్లు చేశామన్నారు.  ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాలు, 150 బెడ్స్ కలిగిన ఆసుపత్రిని సిద్ధం చేసామన్నారు.  అవసరమైన  టెస్ట్ లు అక్కడే చేసేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు.  5 కోట్ల మందికి పైగా టీకాలు వేశామన్నారు.  82% మందికి రెండు డోస్ ల టీకా వేయడం జరిగిందన్నారు. టీనేజర్ లకు 73% మందికి తొలిడోస్ , 13%  మందికి రెండు డోస్ లు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో కేవలం రెండు జిల్లాలో  నిజామాబాద్, ఆసిఫాబాద్ మినహా అంతటా 100% తొలిడోస్  వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు.  వచ్చే కొద్దీ నెలల పాటు కొత్త వేరియెంట్ పుట్టే అవకాశం లేదన్నారు.  త్వరలో కోవిడ్ ఎండమిక్ అవుతుంది. భవిష్యత్తులో సాధారణ ఫ్లూ లా కోవిడ్ మారుతుందన్నారు డీహెచ్.

ఇవి కూడా చదవండి: 

నేనే నెంబర్ వన్... ముచ్చటగా మూడోసారి మోడీ

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో మేడారం ప్రసాదం.. బుక్​ చేస్తే  డోర్ డెలివరీ