
హుస్నాబాద్, వెలుగు : హుస్నాబాద్‌లో మూడున్నర ఎకరాల్లో రూ.17 కోట్లతో నిర్మిస్తున్న ఐవోసీ బిల్డింగ్‌లో కార్పొరేట్ స్థాయిలో అన్ని హంగులు సమకూరుతున్నాయని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. శుక్రవారం ఆర్డీవో బెన్శాలోంతో కలిసి ఆయన బిల్డింగ్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హుస్నాబాద్ డివిజన్లో ఉన్న ఆర్డీవో, తహసీల్దార్, ఇంజినీరింగ్, ఆర్ అండ్ బీ, -పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ, ఆటవీ రేంజ్, ఎస్టీవో ఆఫీసులన్నీ ఇందులో ఉంటాయన్నారు. ఇందులో టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, పార్కింగ్‌తోపాటు అన్ని సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. ఆఫీస్ కాంప్లెక్స్ వరకు బటర్‌ఫ్లై లైట్స్ పెడుతున్నట్టు తెలిపారు. ఆయన వెంట డీటీవో బాలరాజు, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.