కమ్యూనిటీ సెంటర్లలో కార్పొరేట్ వైద్యం అందించాలి

కమ్యూనిటీ సెంటర్లలో కార్పొరేట్ వైద్యం అందించాలి
  • కలెక్టర్ నారాయణ రెడ్డి
  • మన్సాన్ పల్లిలో సమగ్ర కుటుంబ సర్వే పరిశీలన

ఇబ్రహీంపట్నం, వెలుగు: కమ్యూనిటీ సెంటర్లకు వచ్చే రోగులకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలని  రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి వైద్యాధికారులకు సూచించారు.  రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. డయాలసిస్ సెంటర్, రిజిస్ట్రేషన్ సెంటర్, ఫార్మసీ సెంటర్, అవుట్ పేషెంట్ బ్లాక్,  ప్రసూతి గదులు, ఇమ్యూనేషన్ సెంటర్,  ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రే రూం,  క్యాజువాలిటీ సెంటర్లను పర్యవేక్షించారు.   డయాలసిస్ సెంటర్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జితో మాట్లాడి రోజూ ఎంతమందికి డయాలసిస్ చేస్తున్నారు?  వారంలో ఎన్నిసార్లు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.  మహేశ్వరం మండలంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..  విద్యార్థులు ఫోన్లు,  సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు.  మన్సాన్ పల్లి  గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించారు.  ప్రతి ఒక్కరూ సర్వేకు సహకరించాలన్నారు. సర్వే చేస్తున్న తీరు గురించి ఎన్యూమరేటర్ ను అడిగి తెలుసుకున్నారు.  ఎమ్మార్వో సైదులు, ఎంపీడీఓ శైలజా రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.