నిధులు విడుదల చేయండి .. జీహెచ్ఎంసీ జోనల్​ కమిషనర్​ను కోరిన కార్పొరేటర్​ సింధు

నిధులు విడుదల చేయండి .. జీహెచ్ఎంసీ జోనల్​ కమిషనర్​ను కోరిన కార్పొరేటర్​ సింధు

రామచంద్రాపురం, వెలుగు:  భారతీనగర్ జీహెచ్ఎంసీ డివిజన్​లో పెండింగ్ పనులకు టెండర్లను పిలిచి నిధులు విడుదల చేయాలని కార్పొరేటర్ సింధు అధికారులను కోరారు. శుక్రవారం జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్​ ఉపేందర్ రెడ్డిని కలిసి డివిజన్​ పరిధిలోని పనులపై చర్చించారు. పలు పెండింగ్ పనుల ప్రతిపాదనలపై వినతిపత్రం అందజేసి మాట్లాడుతూ బొంబాయి కాలనీ మల్టిపర్పస్​ ఫంక్షన్ హాల్ కాంపౌడ్​ నిర్మాణం, మ్యాక్​ సొసైటీ, బీడీఎల్​ కాలనీల్లో పలు ప్రహారీ నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలన్నారు. 

ఎల్​ఐజీ కాలనీలో వాటర్​డ్రైన్​ పనులకు, ఎంఐజీ కాలనీలో మరికొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో పటాన్​చెరు డిప్యూటీ కమిషనర్​సురేశ్​, ఇంజినీరింగ్ ఎస్​ఈ శంకర్​, బీఆర్​ఎస్ రాష్ట్ర నాయకుడు ఆదర్శ్ రెడ్డి ఉన్నారు.