ఫోర్జరీ సంతకంతో మోసం చేశాడని కరస్పాండెంట్ ఆరోపణ

రాజన్నసిరిసిల్ల, వెలుగు :  తన ఫోర్జరీ సంతకంతో రూ.26లక్షలు డ్రా చేసుకుని మోసం చేశాడని వికాస్​ డిగ్రీ కాలేజీ కరస్పాండెంట్ ​గుగ్గిళ్ల జగన్ గౌడ్ ఆరోపించారు. బుధవారం ఆయన సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్​ పార్టీకి చెందిన శ్రీనివాస్‌‌‌‌తో సహా నలుగురం కలిసి డిగ్రీ కాలేజీ నిర్వహిస్తున్నామన్నారు. శ్రీనివాస్  తన సంతకాన్ని ​ఫోర్జరీ చేసి రూ.26లక్షలు డ్రా చేసుకొని వాడుకున్నాడని జగన్​ ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.