
ముషీరాబాద్, వెలుగు: కాకా డాక్టర్బీఆర్అంబేద్కర్ విద్యాసంస్థల ద్వారా నిరుపేద విద్యార్థులకు అతి తక్కువ ఫీజుతో ఉన్నత విద్యను అందిస్తున్నామని కరస్పాండెంట్ డాక్టర్ సరోజ వివేక్ చెప్పారు. నాణ్యతమైన విద్యతో ఉన్నత చదువులకు బాటలు వేస్తున్నామని తెలిపారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో అంబేద్కర్ స్టూడెంట్లు జయకేతనం ఎగరవేయడం గర్వంగా ఉందన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన స్టూడెంట్లు బండారి లక్ష్మీదీపా(ఎంపీసీ 467/470), జబ కేదార్నాథ్(ఎంపీసీ 465/470), ఉన్నిసా బేగం(ఎంపీసీ 463/470), బైకాని నందు(ఎంపీసీ 463/470), పూజా శర్మ(ఎంఈసీ 489/500)ను బుధవారం కాలేజీలో సత్కరించారు. సరోజ వివేక్‌తోపాటు ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి పాల్గొని విద్యార్థులను అభినందించారు.
అనంతరం సరోజ వివేక్ మాట్లాడుతూ.. విద్యార్థుల కృషికి, అధ్యాపకుల నిబద్ధతకు, తల్లిదండ్రుల అండకు కృతజ్ఞతలు తెలిపారు. ఎక్స్ట్రా క్లాసులు, స్టడీ మెటీరియల్ అందించి విద్యార్థులను గొప్పగా తయారుచేస్తున్నామన్నారు.