GHMC లో అవినీతి: చాంబర్ల రిపేర్ల పేరుతో దందా

GHMC లో అవినీతి: చాంబర్ల రిపేర్ల పేరుతో దందా

జీహెచ్ఎంసీలో బిల్డింగ్ మెయింటనెన్స్ విభాగం అవినీతికి అడ్డాగా మారింది. ఏళ్ల తరబడి అక్కడేతిష్ఠ వేసిన అధికారులు బల్దియాకే పంగ నామాలు పెడుతున్నారు. ‘నమో నారాయణ’ అంటూనిలువు దోపిడీ చేస్తున్నారు. నెల వారీ నిర్వహణ పేరుతో కోట్ల రూపాయలను మింగేస్తున్నారు.మంచినీళ్ల నుండి మొదలు రిపేర్లు, ఫర్నిచర్ సప్లయ్ వరకు అన్నింటిలో గోల్ మాల్ గోవిందా అంటున్నారు. ఇక ఎవరైనా ఐఏఎస్ అధికారులువారి వారి చాంబర్లలో రిపేర్లు చేయాలని కబురు పెడితే చాలు.. 10 నుండి 20 లక్షల వరకు కొటేషన్లతో దిగిపోతున్నారు. ఇదేంటీ అని అడిగే వారేలేక పోవ డంతో.. బల్దియాలో బిల్డింగ్ నిర్వాహకులు ఆడిందే ఆట పాడిందే పాట గా సాగుతోంది. నగరాభివృద్ధి కోసం గతేడాది జీహెచ్ఎంసీకి యువ ఐఏఎస్ అధికారులను కేటాయించింది.హరిచందన , అద్వైత్ సిం గ్ లు అప్పటికే ఉండగా ముషారఫ్ అలీ, సందీప్ ఝా, సిక్తాపట్ నాయక్, శ్రుతి హోజా, ఆమ్రపాలి, విజిలెన్స్ డైరెక్టర్ గా ఐపీఎస్ అధికారి విశ్వజిత్ కంపాటిని నియ మించింది. వీరంతా జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో అడిషనల్ కమిషనర్లు గా విధులు నిర్వర్తిస్తున్నారు.ఈ మధ్యనే ముషార ఫ్ అలీ ఫారూఖీ ఖైర తాబాద్ జోనల్ క మిషనర్ గా వెళ్లారు. అయితే ముషారఫ్ ఐటీ విభాగానికి అడిషనల్ కమిషనర్ గా ఉన్నప్పుడు తన చాంబ ర్ రెనొవేషన్ చేయాలని కోరితే.. మెయింటనెన్స్ విభాగం రూ.22 లక్షల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చాంబర్ ను మరో యువ ఐఏఎస్ అధికారి సిక్తా పట్నాయక్ వినియోగిస్తున్నారు.

చీవాట్లు పెట్టిన సందీప్ ఝా..

ఖమ్మం మున్సిపల్ కమిషనర్ గా పని చేసిన సందీప్ ఝా.. గతేడాది జరిగిన బదిలీల్లో జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ గా వచ్చా రు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో హెల్త్ విభాగానికి అడిష నల్ కమిషనర్ గా పని చేస్తున్న సందీప్ ఝా.. చాంబర్ మదమ్మతుల కోసం బిల్డింగ్ మెయింట నెన్స్ అధికారులకు కబురు పెట్టారు. దీంతో ఆ విభాగం అధికారులు ఫుల్ జోష్ తో వాలిపోయారు. మరమ్మతులకు రూ.12 లక్షలు ఖర్చయ్యే అవకాశంవుందని కొటేషన్ వేశారు. దీంతో సందీప్ ఝాషాక్ కు గురై వారిని ప్రశ్నించి..చీవాట్లు పెట్టినట్లు సమాచారం. అంతేకాదు లక్షన్నర  లోపే రిపేర్లు చేయమని వారిని ఆదేశించినట్లు తెలిసింది. ఇక మరో అడిషనల్ కమిషనర్ శ్రుతి హోజా  చాంబర్ కూడా.. ఈ మ ధ్య కాలంలో వచ్చి న ఈదురుగాలులకు వెంటిలేషన్ కిటికీలు దెబ్బతిన్నాయి. దీంతో మర మ్మతులు చేయాల ని కోరగా బిల్డింగ్ మెయింట నెన్స్ అధికారులు లక్షల్లో కొటేషన్ వేసి ఇచ్చినట్లు సమాచారం. వీరే కాదు మిగిలిన వారు కూడా ఆయా చాంబర్లకు మరమ్మతులు చేసి కొత్తఫర్ని చ ర్ వేయాలని కోరినట్లు సమాచారం. ప్రతి చాంబర్ కు 10 నుండి 20 లక్షల వరకు కొటేషన్లు వేసి ఇచ్చినట్లు తెలుస్తోంది.

రిపేర్ల బడ్జెట్ ను కాజేస్తున్న అధికారులు…

జీ హెచ్ఎంసీ ప్రతి బడ్జెట్ లో రిపేర్లు, ఇతర అవసరాల కోసం కోట్ల రూపాయలను కేటాయిస్తోంది. 2018-–19లో రూ.18 కోట్లు కేటాయిస్తే 2019–-20 కి రూ.24 కోట్లు కేటాయించింది.అయితే వీటిని అధికారులు ఇలా అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారు. ఎంత ఖర్చు అవుతుందని అడ గక పోవడంతో.. బిల్డింగ్ మెయింటనెన్స్ విభాగం అధికారులది ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఇవే కాదు కాన్ఫరెన్స్ హాల్రినోవేష న్, కారిడా ర్, జీహెచ్ఎంసీ బిల్డింగ్ మరమ్మతుల పేరుతో రూ.కోట్లు కాజేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దశాబ్ధకాలంగా మెయింటనెన్స్ విభాగంలో తిష్ఠవేసిన ఓఅధికారే బల్దియా ఖజానాను కొల్లగొడుతున్నారనే టాక్ వినిపిస్తోంది.