సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో జరిగిన వడ్ల కొనుగోళ్లలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. గురువారం సూర్యాపేట జడ్పీ ఆఫీస్‌లో జరిగి సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నేరేడుచర్ల మండలంలోని రెండు పీఏసీఎస్ కేంద్రాల్లో వడ్లు కొనకుండానే కొన్నట్లు తప్పుడు పత్రాలను సృష్టించి, పీఎస్‌సీఎస్ సెంటర్ల నిర్వాహకులు కోట్ల రూపాయలు దోచుకున్నారన్నారు. వడ్ల కొనుగోళ్లలో అవినీతిని వెలికితీయాలని కలెక్టర్, డీసీవో, డీఎంలకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. వడ్ల కుంభకోణంలో ఆఫీసర్ల పాత్ర కూడా ఉందని ఆరోపించారు. మఠంపల్లి మండలంలో 540 సర్వే నంబర్‌లో ఉన్న 46 ఎకరాల ప్రభుత్వ భూమిని ఓ ప్రజాప్రతినిధి కబ్జా చేశాడన్నారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లినా, తనకు పోలీసులు సహకరించడం లేదంటూ చెప్పడం సరికాదన్నారు. దీనిని బట్టి కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తికి రెవెన్యూ ఆఫీసర్ల ఉందన్న అనుమానం కలుగుతోందన్నారు. నేరేడుచర్లలో కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు కలెక్టర్ ఎంపిక చేసిన స్థలం తనదంటూ ఓ వ్యక్తి కోర్టుకు వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లాలో మూసీ నదిపై నిర్మాణంలో ఉన్న చెక్‌డ్యాంల ఎంపికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. టెండర్ వేసిన వ్యక్తి పనులను మరో వ్యక్తి అప్పగించారన్నారు. చెక్‌డ్యాం నిర్మాణాల్లో జరిగిన అవకతవకలను నాబార్డ్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్తాన్నారు.
మునుగోడులో బీజేపీ విజయం ఖాయం
చండూరు (మర్రిగూడ) : మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా చండూరు మండలం గుండ్రపల్లికి చెందిన పలువురు నాయకులు గురువారం మర్రిగూడలో రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు పదవులు ముఖ్యం కాదని నియోజకవర్గ ప్రజల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. పల్లె వెంకన్నగౌడ్, బీజేపీ మండల అధ్యక్షుడు కాసాల జనార్దన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ భూతరాజు ఆంజనేయులు, యాదయ్య, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
గాయపడిన వ్యక్తిని హాస్పిటల్‌కు తరలించిన రాజగోపాల్‌రెడ్డి
చౌటుప్పల్ : గాయపడిన వ్యక్తిని తన వాహనంలో హాస్పిటల్‌కు తరలించి మానవత్వం చాటుకున్నాడు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. వివరాల్లోకి వెళ్తే... చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామానికి చెందిన కుడికాల పాండు సిరిపురంలోని బంధువుల ఇంటికి వెళ్లి బైక్‌పై తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడివనం వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన పాండును మునుగోడు నుంచి వస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గమనించారు. వెంటనే తన వాహనాన్ని ఆపి పాండుకు మంచినీరు అందించి అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అంబులెన్స్ రావడానికి ఆలస్యం కావడంతో పాండును తన వాహనంలో ఎక్కించుకొని మలక్‌పేటలోని యశోధ హాస్పిటల్‌కు తరలించారు.
ఘనంగా ఇంజినీర్స్ డే...
నల్గొండ/సూర్యాపేట : నల్గొండ, సూర్యాపేట జిల్లాలో గురువారం ఇంజినీర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యాపేటలోని ఎస్‌వీ ఇంజినీరింగ్ కాలేజీలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, నల్గొండలో రాజా బహుదూర్ వెంకటరామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. సూర్యాపేటలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడారు. దేశాభివృద్ధిలో ఇంజినీర్లే కీలకం అన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు ఉప్పల రాజేంద్రప్రసాద్, బండారు రాజా, నాతి సవీందర్, వంగవేటి రమేశ్ పాల్గొన్నారు. నల్గొండలో రిటైర్డ్ ఇంజినీర్లు, ఏఈలు, డీఈలను సత్కరించారు. కార్యక్రమంలో గోలి అమరేందర్‌రెడ్డి, వినోద్‌రెడ్డి, సొసైటీ వైస్ ప్రెసిడెంట్ ఏపాల సత్యనారాయణరెడ్డి, యారాల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
గ్లోబల్ పీస్ ర్యాలీని సక్సెస్ చేయాలి...
చౌటుప్పల్, వెలుగు : అక్టోబర్ 2న జింఖానా గ్రౌండ్‌లో జరిగే గ్లోబల్ పీస్ ర్యాలీని సక్సెస్ చేయాలని గ్లోబల్ పీస్ కమిటీ సభ్యుడు, ప్రజా గాయకుడు గద్దర్ పిలుపునిచ్చారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో గురువారం మీడియాతో మాట్లాడారు. కేఏ పాల్ ఆధ్వర్యంలో జరిగే ర్యాలీని సక్సెస్ చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. మునుగోడులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ఈ నెల 25లోగా స్థలాన్ని సేకరించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రజాశాంతి పార్టీ నాయకురాలు జ్యోతిపాల్, నరసింహ పాల్గొన్నారు
కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లకుండా కుట్ర...
యాదాద్రి/యాదగిరిగుట్ట : సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రాకుండా బీజేపీ కుట్ర చేస్తోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి ఆరోపించారు. ఇందులో భాగంగానే కేసీఆర్ కుటుంబ సభ్యులపై ఈడీ, ఐటీ సంస్థలతో దాడి చేయిస్తూ భయపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకకు చెందిన పలువురు గురువారం యాదగిరిగుట్టలో గొంగిడి దంపతుల సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ఆర్థిక మూలాలు దెబ్బతీసి ఇబ్బంది పెట్టాలని చూస్తోందన్నారు. రాష్ట్రాభివృద్ధిపై బీజేపీ లీడర్లు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారన్నారు. జడ్పీటీసీ తోటకూరి అనురాధ బీరయ్య, యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, ఆలేరు మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్, సర్పంచ్ లక్ష్మీప్రసాద్ రెడ్డి, మండల సెక్రటరీ జనరల్ కసావు శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. యాదగిరిగుట్ట మండలం మహబూబ్‌పేటకు చెందిన టీఆర్‌ఎస్ లీడర్ గాజుల సిద్ధులు ఇటీవల చనిపోయాడు. అతడి టీఆర్‌ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ కింద మంజూరైన రూ. 2 లక్షలను మృతుడి భార్య భాగ్యలక్ష్మికి అందజేశారు. అనంతరం గొంగిడి మహేందర్‌రెడ్డి ఆలేరు వ్యవసాయ మార్కెట్‌లో 60 మంది హమాలీలకు గుర్తింపు కార్డులు అందజేశారు.
‘కేసీఆర్ నిర్ణయం చిరస్థాయిగా నిలిచిపోతుంది’
సూర్యాపేట : సెక్రటేరియట్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలన్న నిర్ణయం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేటలోని ఖమ్మం క్రాస్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంపీ బడుగుల లింగయ్య యాదతవ్, ఎమెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, సైదిరెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ ఫొటోకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్తగా కడుతున్న పార్లమెంట్ బిల్డింగ్‌కు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. జడ్పీ చైర్‌పర్సన్ గుజ్జ దీపిక, వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణగౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ పాల్గొన్నారు. అనంతరం సీపీఎం ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన నవ తెలంగాణ బుక్ స్టాల్‌ను మంత్రి
ప్రారంభించారు.
‘తెలంగాణ ఉద్యమ చరిత్రను స్టూడెంట్లు తెలుసుకోవాలి’
మిర్యాలగూడ : నిజాం పాలనపై తిరుగుబాటు చరిత్రను స్టూడెంట్స్ తెలుసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీ రుద్రమ సూచించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు జాస్తి గోపి ఆధ్వర్యంలో గురువారం జరిగిన సెమినార్‌లో ఆమె మాట్లాడారు. నిజాం దోపిడీ, దౌర్జన్యాలపై సాయుధ పోరు సాగించిన గడ్డ ఉమ్మడి నల్గొండ జిల్లా అని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఇన్నాళ్లూ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీజేపీ స్టేట్ లీడర్ సాధినేని శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేశ్, వెంకట్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు కొండేటి సరిత పాల్గొన్నారు.
మంత్రి సమక్షంలో చేరితేనే గుర్తిస్తరా ?
మునుగోడు : మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరితేనే గుర్తిస్తరా ? ప్రగతి భవన్‌లో చేరిన నాయకులను పట్టించుకోరా ? అని నల్గొండ జిల్లా కిష్టాపురం సర్పంచ్ నందిపాటి రాధా రమేశ్, కల్వలపల్లి సర్పంచ్ వంటెపాక జగన్ ప్రశ్నించారు. మునుగోడులో గురువారం మీడియాతో మాట్లాడారు. తాము గత నెల 14న ప్రగతి భవన్‌లో మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్ స్టేట్ లీడర్ కంచర్ల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ చేరినట్లు చెప్పారు. అప్పటి నుంచి టీఆర్‌ఎస్ పార్టీ సమావేశాలకు, సొంత గ్రామాల్లో జరిగే ప్రోగ్రామ్స్‌కు సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత సర్పంచులం అయినందుకే మంత్రి జగదీశ్‌రెడ్డి తమను వేధిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల కిష్టాపురంలో జరిగిన పలు ప్రోగ్రామ్స్‌కు మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, జగదీశ్‌రెడ్డి హాజరయ్యారని, ఈ కార్యక్రమానికి ఆ గ్రామ సర్పంచ్‌నైన తనను పిలవకపోడవం దారుణం అన్నారు. గౌరవం లేని చోట తాము కొనసాగలేమని,
అందుకే టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలి...
చౌటుప్పల్ : చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర అధ్యక్షుడు గంజి మురళీధర్ డిమాండ్ చేశారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో గురువారం జరిగిన చేనేత సహకార సంఘం రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. చేనేత కార్మికుల క్యాష్ క్రెడిట్, పర్సనల్ లోన్లను మాఫీ చేయాలని, చేనేత వస్త్రాల అమ్మకంపై 20 శాతం రిబేట్‌ను ఇప్పించాలని కోరారు. సొంత స్థలం కలిగి ఉన్న చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం చేయాలని, 60 ఏళ్లు పైబడిన చేనేత కార్మికులు చనిపోతే అతడి ఫ్యామిలీకి రూ. 5 లక్షల బీమా ఇచ్చేలా ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బడుగు శంకరయ్య, జిల్లా గౌరవ అధ్యక్షుడు గోశిక స్వామి, ఆప్కో మాజీ డైరెక్టర్ గర్దాసు బాలయ్య, చేనేత సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు గుర్రం నరసింహ, నాయకులు కందగట్ల భిక్షపతి, డీసీసీబీ డైరెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధుల పట్ల అలర్ట్‌గా ఉండాలి
నల్గొండ అర్బన్ : సీజనల్ వ్యాధుల పట్ల అలర్ట్‌గా ఉండాలని నల్గొండ జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి హెల్త్ సిబ్బందిని ఆదేశించారు. గురువారం జడ్పీలో జరిగిన వివిధ స్థాయీ సంఘ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. జిల్లాలో వైరల్ ఫీవర్స్ బాధితుల సంఖ్య పెరిగిపోతోందని డెంగీ, మలేరియా వంటి వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైరల్ ఫీవర్స్‌ను కంట్రోల్ చేసేందుకు ఆఫీసర్లు చర్యలు చేప్టటాలన్నారు. రైతు వేదికలు తెరిచి ఉంచేలా చూడాలని అగ్రికల్చర్ ఆఫీసర్లకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ ఇవ్వాలని ఆదేశించారు.
చరిత్రను వక్రీకరిస్తున్నరు...
దేవరకొండ : రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని నిర్వహించిన ఘనత కమ్యూనిస్టులదేనని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నర్సింహారెడ్డి అన్నారు. గురువారం నల్గొండ జిల్లా దేవరకొండ మండలం పడ్మట్‌పల్లిలోని పల్లా పర్వత్‌రెడ్డి స్మారక స్థూపం నుంచి దేవరకొండ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు వ్యక్తులు చరిత్రను వక్రీకరిస్తూ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఓట్ల రాజకీయాలు చేస్తున్న వారికి తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఉజ్జిణి యాదగిరిరావు, పల్లా దేవేందర్‌రెడ్డి, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నర్సింహ, జిల్లా కార్యవర్గసభ్యుడు బొడ్డుపల్లి వెంకటరమణ, తూం బుచ్చిరెడ్డి, ఎండీ మైనొద్దీన్, పార్లపల్లి కేశవరెడ్డి, ఎస్ కనకాచారి, పోలె వెంకటయ్య పాల్గొన్నారు.
వ్రత మండపాన్ని త్వరగా పూర్తి చేయాలి...
యాదగిరిగుట్ట : కార్తీకమాసం ప్రారంభమయ్యేలోపు సత్యనారాయణస్వామి వ్రత మండపాన్ని అందుబాటులోకి తేవాలని ఈవో గీతారెడ్డి ఆదేశించారు. యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా కొత్తగా కడుతున్న సత్యనారాయణస్వామి వ్రత మండపాన్ని గురువారం ఆమె పరిశీలించారు. అక్టోబర్ 26న కార్తీకమాసం ప్రారంభం అవుతున్నందున పనులను త్వరగా కంప్లీట్ చేయాలని సూచించారు. ఆమె వెంట ఆర్‌అండ్‌బీ ఈఈ వెంకటేశ్వర్‌రెడ్డి, శివాలయ ప్రధానార్చకుడు సత్యనారాయణశర్మ ఉన్నారు.
వెండి కలశాల కోసం రూ.2.40 లక్షల విరాళం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారికి వెండి కలశాల కోసం ఎమ్మెల్సీ దయానంద్, మరో దాత చంద్రయ్య కలిసి రూ. 2.40 లక్షలు విరాళంగా ఇచ్చారు. అనంతరం వారు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఏఈవో గజవెల్లి రఘు, సూపరింటెండెంట్ విజయ్‌కుమార్ స్వామివారి ప్రసాదం అందజేశారు.
క్రీడలతో మానసికోల్లాసం
హాలియా : క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ చెప్పారు. తెలంగాణ జాతీయ సమైక్యతా ఉత్సవాల్లో భాగంగా గురువారం నల్గొండ జిల్లా హాలియా హైస్కూల్‌లో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వర్ర వెంకట్‌రెడ్డి గంగా భవాని ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నల్గొండ సుధాకర్, దేపావత్ ప్రసాద్, అన్నెపాక శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఉప ఎన్నికల్లో గెలుపు టీఆర్‌ఎస్‌దే...
చౌటుప్పల్ : మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం ఖాయమని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చౌటుప్పల్‌లో గురువారం జరిగిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు.
సర్కార్ స్కూళ్ల బలోపేతానికి కృషి చేయాలి
సంస్థాన్ నారాయణపురం : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రజాప్రతినిధులు కృ-షి చేయాలని యాదాద్రి డీఈవో నారాయణరెడ్డి సూచించారు. సంస్థాన్ నారాయణపురం మండలంలోని రాచకొండ, కడీలబావి, తుంబావి, ఐదు దొనలతండా ప్రైమరీ స్కూళ్లు, హైస్కూల్‌కు దాత నక్క శ్రీనివాస్ యాదవ్ సాయంతో రూ. 3 లక్షల క్రీడా సామగ్రిని అందజేశారు. ఎంఈవో నాగవర్ధన్ రెడ్డి, హెచ్‌ఎం వేణుగోపాల్, సురేందర్‌రెడ్డి, రమేశ్, నోడల్ ఆఫీసర్ హనుమంతు పాల్గొన్నారు.