
ఏదో నాలుగు పచ్చడి మెతుకులు వేసుకుని తినే రోజులు కూడా పోయాయి.. ఎందుకంటే.. ఆ పచ్చడి చేయటానికి కావాల్సిన కూరగాయలు ధరలు ఆ రేంజ్ లో పెరిగిపోయాయి. టమాటా కిలో 200, పచ్చిమిర్చి కిలో 200.. ఇలా ఏ కూరగాయ పట్టుకున్నా వందల రూపాయలు అవుతుంది. దీంతో పచ్చడి మెతుకులు తినటం కూడా మానేశారంట జనం.. మరి ఏం తింటున్నారు అంటే.. శుభ్రంగా కోడి కూర తింటున్నారంట.. అవును నిజం.. ఇండియాలో గత రెండు నెలలుగా.. అంటే జూన్, జులై నెలలో.. శాఖాహారం కంటే.. మాంసాహారం ఎక్కువ తిన్నారంట.. దీనికి కారణం.. వెజ్ భోజనం కంటే.. నాన్ వెజ్ భోజనం చీప్ గా ఉండటమే.. కిలో కూరగాయలతో కిలో కోడి మాంసం వస్తుంది.. ఇంటిల్లపాది రెండు పూటల తినొచ్చన్న ఉద్దేశంతో.. ఇలా తిన్నారంట చాలా మంది జనం..
ఏ కూర చేసే తీరిక లేకపోతే గతంలో నాలుగు పచ్చడి మెతుకులు తిని కడుపునింపుకొనేవారు. కాని ఇప్పుడు అలాకాదు.. రెండు చికెన్ మెతుకులు తిని పొట్ట నింపుకుంటున్నారు. ఎందుకంటే పచ్చడి తయారు చేసేందుకు కావలసిన రా మెటిరియల్ కాస్ట్... చికెన్ ధరను మించిపోయింది. అసలే అర కొర జీతాలతో బతికే మధ్యతరగతి ప్రజలు మరి ఏం చేస్తారు.. మరి ఏదొో ఒకటి తిని ఆకలి చంపుకోవాలికదా... అని చికెన్ మార్కెట్లవైపు జనాలుపరుగులు పెడుతున్నారని చెన్నైలోని క్రిసిల్ అనే సంస్థ చేసిన సర్వే నివేదిక ద్వారా తెలుస్తోంది.
కూరగాయల ధరలు మండిపోవడంతో చాలా మంది జనాలు శాఖాహారం తినడం మానేశారు. కూరగాయాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఏ కూరకొనాలన్నా... వందలు పెట్టాల్సిందేనని జనాలు బెంబేలెత్తుతున్నారు. దీంతో జనాలు వెజ్ కంటే నాన్ వెజ్ వైపై మొగ్గుచూపుతున్నారు. కూరగాయలు ఇంటిల్లపాదికి సరిపోవాలంటే కనీసం పూటకు కేజీ కావాలి. ఇక బెండకాయి, టమాటా అయితే ఇంకా అదనంగా అవసరవమవుతాయి. అయితే నాన్ వెజ్ కేజీ తెచ్చుకొంటే ఇంటిల్లపాదికి రెండుపూటలా వస్తుంది. అందులో రోజూ నాన్ వెజ్ తింటున్నారంటే ఎంతో రిచ్ అని కూడా భావిస్తున్నారు. ఇది ఎలా ఉన్నా జానెడు పొట్ట నింపుకోవాలంటే ఏదో ఒకటి తినాలి కదా... అని జనాలు శాఖాహారం మానేసి మాంసాహారం వైపు మొగ్గుచూపుతున్నారు.
జనాలు శాఖాహారం కంటే మాంసాహారం వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారో చెన్నైలోని క్రిసిల్ సంస్థ సర్వే చేసింది. ఈ ఏడాది జూన్ లో కూరగాయల ధరలు 34 శాతం పెరిగితే మాంసాహారానికి సంబంధించిన ధరలు కేవలం 13 శాతమే పెరిగాయని క్రిసిల్ నివేదిక తెలిపింది. శాఖాహారం థాలీలో రోటీ, కూరగాయలు (ఉల్లిపాయ, టమోటా మరియు బంగాళాదుంప), బియ్యం, పప్పు, పెరుగు , సలాడ్ ఉంటాయి. మాంసాహార థాలీ కోసం, పప్పుకు బదులుగా చికెన్ ను తీసుకొని సర్వే చేశామని క్రిసిల్ ప్రతినిథులు తెలిపారు.
ALSO READ :ఎవరూ కొనటం లేదు : భారీగా తగ్గిన టమాటా హోల్ సేల్ ధర..
శాకాహార భోజనం ధర 34 శాతం పెరగడానికి ...జూన్ నెలలో టమాటా ధర 233 శాతం పెరగడమే కారణమని క్రిసిల్ పేర్కొంది. ఇక మిగతా వాటి ధరల విషయంలో జులై నెలలో ఉల్లి 16 శాతం, బంగాళాదుంప 9 శాతం, మిర్చి 69 శాతం, జీలకర్ర 16 శాతం పెరిగాయి. వెజిటబుల్ ఆయిల్ ధరలో జూన్ లో 2 శాతం తగ్గుదలతో కొంత ఉపశమనం కలిగించిందని క్రిసిల్ నివేదిక తెలిపింది.
కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. టమాటా , పచ్చిమిర్చి ధర 200 రూపాయిలు మెంతికూర రూ.150కి చేరగా క్యారెట్, వంకాయ, బీన్స్, క్యాప్సికం, చిక్కుడు, బెండ తదితరాలు కూడా కొనలేకపోతున్నామని జనాలు గగ్గోలు పెడుతున్నారు. సంతలు, మార్కెట్లకు వెళ్లిన వినియోగదారులు ధరలు చూసి హడలెత్తిపోయారు. ప్రస్తుత ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పెరిగిందని, కిలో కొనేవాళ్లం 100 గ్రాములు, పావుకిలోతో సరిపెట్టుకుంటున్నామని పేర్కొన్నారు.