సామాన్యులు, మధ్య తరగతి వాళ్లు కొత్త డ్రస్సు కొనుక్కోవాలంటే.. ముందు రేటు స్టిక్కర్ చూస్తాం.. అదే డబ్బున్నోళ్లు అయితే బ్రాండ్ చూస్తారు.. అలాంటిది అంబానీ కోడలు అయితే.. నచ్చితే చాలు.. ధర అనేది లెక్కే లేదు. ఇలాంటి విషయమే ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ముకేష్ అంబానీ చిన్న కోడలు ఇటీవల దుబాయ్ పర్యటనకు వెళ్లారు. ఆమె ధరించిన దుస్తులు విలువ ఇప్పుడు అందరిలో చర్చనీయాంశం అయ్యాయి. ఎందుకంటే.. ఆ డ్రస్సు ఖరీదు అక్షరాల మూడు లక్షల రూపాయలు. అమ్మో అని నోరెళ్లబెట్టటం సామాన్యుల వంతు. మూడు లక్షల రూపాయల డ్రస్సు అంటే మాటలా.. ఓ మధ్య తరగతి కుటుంబం ఏడాది సంపాదన.. ఏడాది జీతం.. అంత ఖరీదైన డ్రస్సును అంబానీ కోడలు ధరించటమే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఆ డ్రస్స్ బ్లూ కలర్లో ఉంది.
ALSO READ :ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్లో మంటలు..రెండు బోగీలు దగ్ధం
ఆమె దుస్తులను ప్రీమియం బ్రాండ్ డియోర్ బ్లూ కాటన్ షర్ట్ డ్రెస్ హైలెట్ చేసింది. రాధిక నలుపు రంగు స్నీకర్లతో కలిపి, తన లుక్‌ను క్లాస్‌గా ఉంచుకుంది. తనలోని కళాత్మక దృష్టికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రాధికా మర్చంట్ తన కాస్ట్యూమ్స్‌తో తరచూ వార్తల్లో ఉంటారు. అప్పట్లో ఆమె చేతిలోని చిన్న బ్యాగు గురించిన సమాచారం షాక్ కు గురి చేసింది. దాని ధర రూ.53 లక్షలు కావడం సంచలనం సృష్టించింది.