Costume Krishna : కాస్ట్యూమ్ కృష్ణను ఇండస్ట్రీకి దూరం చేసిన రెండు సంతకాలు

Costume Krishna : కాస్ట్యూమ్ కృష్ణను ఇండస్ట్రీకి దూరం చేసిన రెండు సంతకాలు

మనం ఏ పనిచేసినా.. ఇంటి పేరుతోనే గుర్తింపు వస్తుంది. ఫలానా వ్యక్తి అని ఇంటి పేరుతో చెప్తేనే చాలా మంది గుర్తు పడతారు. అయితే, సినీ ఇండస్ట్రీలో అలా కాదు. వాళ్ల చేసిన వృత్తి.. ఇంటి పేరుగా మారిపోతుంది. దానివల్లే వాళ్లకు సినీ ఇండస్ట్రీలో గుర్తింపునిస్తుంది. సీనియర్ నటుడు కృష్ణకు కూడా అలానే జరిగింది. సినీ ఇండస్ట్రీకి వచ్చాక మాదాసు కృష్ణ కాస్త.. కాస్ట్యూమ్స్ కృష్ణగా మారిపోయాడు. ఒక్కటేమిటి.. నిర్మాతగా, నటుడిగా, కాస్ట్యూమ్స్ డిజైనర్ పనిచేసి పేరుపొందిన ఆయన... జీవితంలో చేసిన రెండు సంతకాలు ఆయనను ఇండస్ట్రీకి దూరం చేశాయి.

ట్రెండ్ సెట్ చేశారు

విజయనగరం జిల్లా లక్కవరపు కోటలో జన్మించిన కాస్ట్యూమ్ కృష్ణ.. 8 సినిమాలకు నిర్మాతగా చేశారు. 1954లో అసిస్టెంట్ కాస్ట్యూమ్స్ డిజైనర్ గా ప్రారంభం అయిన ఆయన కెరీర్... రామానాయుడు స్టూడియోలో పర్మినెంట్ కాస్ట్యూమ్స్ డిజైర్ గా మారే స్థాయికి చేరింది. లెక్కలేనన్ని సినిమాల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవి వంటి కథానాయికలకు కాస్ట్యూమ్స్ అందించి సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేశారు. 

అప్పటి ట్రెండ్ కి తగ్గట్టు హీరోలకి బెల్ బాటం నుంచి బ్యాగీ ప్యాంట్ లవరకూ రకరకాల మోడల్స్ బట్టలను అందించేవాడు. ఈయన చేసిన కాస్ట్యూమ్స్ అప్పట్లో  ట్రెండ్ సెట్ చేశాయి. ఈ కష్టానికి తగ్గ ఫలితం కూడా దక్కేది.

కోడి రామకృష్ణతో నటుడిగా ఎంట్రీ..

కాస్ట్యూమ్ డిజైనర్ గా బిజీ ఉన్న టైంలో.. కృష్ణ బాడీ లాంగ్వేజ్ చూసి, డైరెక్టర్ కోడి రామకృష్ణ సినిమాల్లో అవకాశం ఇచ్చారు. అలా భారత్ బంద్ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే నటుడిగా గుర్తింపు పొందిన ఆయనకు అవకాశాలు క్యూ కట్టాయి. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో నటించారు.

నటుడిగా సక్సెస్ వచ్చిన తర్వాత... సూపర్ స్టార్ కృష్ణని హీరోగా పెట్టి అశ్వద్దామ సినిమా నిర్మించాడు. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. ఇక వెంట వెంటనే కోడి రామకృష్ణ డైరెక్షన్ లో పెళ్ళాం చెపితే వినాలి, మా ఊరు మారదు, పుట్టింటికి రా చెల్లి, పెళ్లి పందిరి వంటి బ్లాక్ బస్టర్స్ ని తీశారు కాస్ట్యూమ్స్ కృష్ణ. ఆయన జీవితంలో అంతా మామూలుగా గడుస్తున్న టైంలో చేదు అనుభవం ఎదురయింది.

ఆ రెండు సంతాకాలు..

పెద్దగా చదువుకోని కృష్ణకు తెలుగు, తమిళ్ తప్ప వేరే భాష రాదు. జగపతి బాబు పెళ్లి పందిరి సినిమాకు నిర్మాతగా చేసిన కృష్ణకు జీవితంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆయనను సినిమాలకు దూరం చేసింది. చదువు లేని ఆయన బలహీనతను ఆసరాగా తీసుకొని కొందరు మోసం చేశారు. దొంగ సంతకాలు పెట్టించుకొని మోసం చేశారు.
 
పెళ్లి పందిరి సినిమాకు కేవలం మౌత్ పబ్లిసిటీ సరిపోతుంది అనుకొని నమ్మిన కృష్ణకు బయ్యర్ల బయపడ్డారు. తర్వాత సినిమా హీరో జగపతి బాబుతో చర్చలు జరిపి.. సినిమా ప్రమోషన్స్ కోసం రూ.2 లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు ఇచ్చినవాళ్లు ఒక బాండ్ పేపర్ లో రూ. 2 లక్షలు అప్పు ఇచ్చినట్లు,  ఇంకొక బాండ్ లో పెళ్లిపందిరి సినిమాకి సంబంధించిన నెగిటివ్ రైట్స్ కొనుగోలు చేసినట్లు కాస్ట్యూమ్స్ కృష్ణతో సంతకాలు తీసుకున్నారు. 

ఈ విషయం లేట్ గా తెలుసుకున్న కృష్ణ.. తనకు నమ్మక ద్రోహం చేశారని బాధపడ్డాడు. దాంతో సినిమాలపై విరక్తి పుట్టి.. చిత్ర పరిశ్రమకు పూర్తిగా దూరమయ్యారు. ఇక అప్పటినుంచి చెన్నైలోని ఓ అపార్ట్మెంట్ లో సాధారణ జీవితం గడిపాడు. అదే నివాసంతో ఇవాళ తుది శ్వాస విడిచారు.