ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు పత్తి పోటెత్తింది. సంక్రాంతి పండుగ తర్వాత సీసీఐ పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తుందని ప్రచారం జరగడంతో రైతులు పత్తి లోడ్లతో మార్కెట్‌కు క్యూ కట్టారు. పెద్ద ఎత్తున వెహికల్స్తరలి రావడంతో మార్కెట్ చుట్టూ భారీగా ట్రాఫిక్జామ్ఏర్పడింది.
రెండు గంటల పాటు పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. శుక్రవారం ఒక్కరోజే దాదాపు 2 వేల బండ్లు మార్కెట్ కు వచ్చినట్టు అధికారులు తెలిపారు. కాగా లారీ డ్రైవర్ల బంద్‌తో ఇప్పటికే పత్తి నిల్వలు పేరుకుపోగా, కొత్తగా వచ్చిన పత్తితో మార్కెట్నిండిపోయింది. కొనుగోళ్లు నిలిచిపోయిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయల్‌శంకర్, అడిషనల్కలెక్టర్శ్యామలాదేవి మార్కెట్‌కు చేరుకుని పరిశీలించారు. లారీల ఓనర్లతో మాట్లాడి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పారు.
- వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్