వరంగల్: పత్తి ధరలు రోజు రోజుకూ పడిపోతున్నాయి. ఏనుమాముల మార్కెట్ యార్డులో పత్తి ధర 8వేలకు పడిపోయింది. మూడురోజుల కింద రూ.8,300 ఉన్న పత్తి క్వింటం ధర.. నిన్న 8,100కు పడిపోగా ఇవాళ రూ.8,025కు మించి పలకలేదు. పత్తి ధర రోజు రోజుకూ పతనం అవుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
వ్యాపారులంతా కలసి కుమ్ముక్కయి తక్కువ ధర చెల్లించి దోచుకుంటున్నారని రైతులు ఆరోపించారు. ఏటా పంట కోసి మార్కెట్ కు తీసుకొచ్చే సమయంలో అదను చూసి ధర తగ్గిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారులు సిండికేట్ గా మారి అగ్గువ ధరకు కొంటున్నారని అధికారులకు చెప్పినా పట్టించుకుంటలేరని వాపోయారు.