కాశీబుగ్గ, వెలుగు : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పత్తి కొనుగోళ్లు బంద్ చేస్తున్నట్లు కాటన్ అసోసియేషన్ అండ్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ బొమ్మినేని రవీందర్‌రెడ్డి చెప్పారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్1, ఎల్2, ఎల్3 పేరుతో పెట్టిన రూల్స్‌తో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఈ రూల్స్‌కు వ్యతిరేకంగా నేడు నిర్వహించే పత్తి కొనుగోళ్ల బంద్‌కు కాటన్ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఇండస్ట్రీస్ యజమానులు సహకరించాలని కోరారు. రైతులెవరూ తమ పత్తిని జిన్నింగ్ మిల్లులకు, మార్కెట్‌కు తీసుకురావొద్దని సూచించారు.