దహెగాం, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్, దహెగాం, బెజ్జూర్, చింతలమానేపల్లి మండలాల్లో బుధవారం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి కాగజ్‌నగర్, దహెగాం మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురవగా.. బెజ్జూర్, చింతలమానేపల్లి, కౌటాల మండలాల్లో భారీ వర్షం కురిసింది.
తీయడానికి సిద్ధంగా ఉన్న పత్తి తడిసిపోయింది. వరిపంట నేలకొరిగింది. దీంతో రైతులు ఆందళన చెందుతున్నారు.