పత్తి తూకంలో మోసం..వ్యవసాయ మార్కెట్కు తాళం వేసిన రైతులు

పత్తి తూకంలో మోసం..వ్యవసాయ మార్కెట్కు తాళం వేసిన రైతులు

ఖమ్మం జిల్లా ఏన్కూరు వ్యవసాయ మార్కెట్లో దళారులు రైతులను దోచుకుంటున్నారు. దళారులు మోసానికి పాల్పడినట్టు గుర్తించిన రైతులు ఆగ్రహించారు.రైతుల వద్ద కొనుగోలు చేసిన పత్తి తూకంలో తేడా రైతులు గుర్తించడంతో దళారుల బాగోతం బయటపడింది. ఆగ్రహించిన రైతులు వ్యవసాయ మార్కెట్ కు తాళం వేసి నిరసన తెలిపారు. 

ఏన్కూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు తాళం వేశారు పత్తి రైతులు. మార్కెట్ లో కొనుగోలు చేస్తున్న పత్తి తూకంలో మోసానికి పాల్పడినట్టు గుర్తించారు. క్వింటాకు 20 కిలోలు తేడా రావడంతో రైతులు కోపంతో దళారులు నిలదీశారు. ఇష్టానుసారంగా ధరలు తగ్గిస్తూ, తూకంలో మోసానికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. 

ALSO READ | నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

కష్టపడి చెమటోడ్చి పండించిన పంట..అమ్ముకొందామని మార్కెట్ కు తీసుకొస్తే ఇంతమోసమా.. ఒకటి కాదు రెండు ఏకంగా క్వింటాకు 20 కిలోల తేడా వస్తే ఏం చేయాలి. ఇంత దారుణంగా మోసం చేస్తారా.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని..ఖమ్మం జిల్లా ఏన్కూరు వ్యవసాయ మార్కెట్లో పత్తి తూకంలో మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.