- స్వాములకు అన్నదానం
కోల్‌బెల్ట్, వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావాలని రామకృష్ణాపూర్ గీతామందిర్‌లో పూజలు చేసి అన్నదానం నిర్వహించారు. శుక్రవారం క్యాతనపల్లి మున్సిపల్21వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ పార్వతి విజయ ఆధ్వర్యంలో వేదపండితుల సమక్షంలో మహిళలు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం మాలలు ధరించిన స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్మాట్లాడుతూ.. చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఏడాది కాలంలోనే వందల కోట్ల ఫండ్స్‌ను సాంక్షన్ చేయించి పట్టణాలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని అన్నారు.
ఆయన ఎంపీగా ఉన్నప్పుడు సింగరేణి ప్రాంత వాసుల సౌకర్యార్థం రామకృష్ణాపూర్ రైల్వే స్టేషన్లో ఇంటర్సిటీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్కల్పించారని, క్యాతనపల్లి రైల్వే గేట్‌వద్ద రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ఫండ్స్ మంజూరు చేశారన్నారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి వస్తే నియోకవర్గం మరింత అభివృద్ధి చెందడంతో పాటు అన్ని వర్గాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం వెంటనే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో మేదరి లక్ష్మి, గోరేటి సీత, పద్మ, నాగుల లక్ష్మి, వెంకట శారద, వరలక్ష్మి, కవిత తదితరులు పాల్గొన్నారు.