జనగామ, వెలుగు : జనగామ అభివృద్ధికి తాను కృషి చేస్తానని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. జనగామ మున్సిపాలిటీలో రూ.50 కోట్లు, చేర్యాలలో రూ.25 కోట్లతో అంతర్గత రోడ్లు, సైడ్డ్రైనేజీల నిర్మాణానికి ప్రపోజల్స్ రెడీ చేసినట్లు చెప్పారు. జనగామ, చేర్యాల మున్సిపల్ కౌన్సిలర్లు బుధవారం హైదరాబాద్‌లో పల్లాను కలిశారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ రెండు రోజుల్లో జనగామ అభ్యర్తిత్వం ఖరారు ప్రకటన వస్తుందని, ఆ తర్వాత నియోజకవర్గానికి వస్తానని చెప్పారు.
జనగామ శివారు రంగప్ప చెరువును సిద్దిపేట కోమటి చెరువులా తీర్చిదిద్దాలని కౌన్సిలర్లు కోరగా పల్లా సానుకూలంగా స్పందించారు. త్వరలో ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఉన్నందున పార్టీ పనుల్లో వేగం పెంచాలని కోరారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో హైకమాండ్ చర్చలు జరిపిందన్నారు. పల్లాను కలిసిన వారిలో జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోకల జమున లింగయ్యతో పాటు ఏడుగురు కౌన్సిలర్లు, ఇద్దరు కోఆప్షన్ మెంబర్లు ఉన్నారు.