రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో చైర్మన్లపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాన ప్రతిపాదనలను పెట్టారు. అదే బాటలో యాదాద్రి మున్సిపల్ కౌన్సిలర్లు కూడా నిలిచారు. యాదాద్రి మున్సిపల్ చైర్పర్సన్ సుధాహేమేందర్ గౌడ్పై అవిశ్వాసానికి కౌన్సిలర్లు సిద్దమయ్యారు. ఇటీవల చైర్మన్ పదవి హామీతో పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. మరో ఏడాది వరకు మున్సిపాలిటీల్లో అవిశ్వాసం లేదని మంత్రి కేటీఆర్ ఇటీవలె వ్యాఖ్యానించారు. అయినా యాదాద్రి కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.