ఏటూరునాగారం, వెలుగు : ఏజెన్సీలోని ఇసుక క్వారీలకు వచ్చి పోయే లారీల వల్ల నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఏటూరునాగారం ఏఎస్పీ మహేశ్ గీతే బుధవారం స్థానిక ఇసుక క్వారీ వద్ద లారీ డ్రైవర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రధాన రహదారిపై లారీలను పార్కింగ్ చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగి, ప్రజలు మృత్యువాత పడుతున్నారన్నారు.
మద్యం సేవించి వాహనాలు నడపొద్దని హెచ్చరించారు. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయనవెంట ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ తదితరులున్నారు.